Lady teacher: ఇంట్లో మొగుడు, స్కూల్ లో ప్రియులు, పాత ప్రియుడి చేతిలో కొడుకు !

బెంగళూరు/ గదగ్: వివాహం చేసుకున్న మహిళ ప్రభుత్వ స్కూల్ లో పార్ట్ టైమ్ టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. ఇదే స్కూల్ ఉద్యోగం చేస్తున్న టీచర్ కు వివాహం అయ్యింది. లేడీ టీచర్ తో ఆ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అతనికి కూడా వివాహం అయ్యి భార్య, పిల్లలు ఉన్నారు. చాలాకాలం నుంచి పార్ట్ టైమ్ టీచర్ తో అతను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే స్కూల్ ఉద్యోగం చేస్తున్న మరో టీచర్ తో లేడీ టీచర్ చనువు పెంచుకుంది. ఈ విషయం జీర్ణించుకోలేని ప్రియుడు లేడీ టీచర్, ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్, ఆమె కొడుకు మీద కత్తి, ఇనుప రాడ్ తో దాడి చెయ్యడంతో ఒకరి ప్రాణం పోయింది.

 ప్రభుత్వ స్కూల్ లో టీచర్లు

ప్రభుత్వ స్కూల్ లో టీచర్లు

కర్ణాటకలోని గదగ్ జిల్లాలోని నరుంద తాలుకాలోని హద్లీ గ్రామంలో ప్రభుత్వ స్కూల్ ఉంది. వివాహం చేసుకున్న గీతా అనే మహిళ ఇదే ప్రభుత్వ స్కూల్ లో పార్ట్ టైమ్ టీచర్ గా ఉద్యోగం చేస్తోంది. ఇదే స్కూల్ ఉద్యోగం చేస్తున్న ముత్తప్ప అనే టీచర్ కు వివాహం అయ్యింది. ముత్తప్పకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 ఇంట్లో మొగుడు... స్కూల్ లో ప్రియుడు

ఇంట్లో మొగుడు... స్కూల్ లో ప్రియుడు

కొన్ని సంవత్సరాల నుంచి అదే స్కూల్ లో పని చేస్తున్న ముత్తప్పతో లేడీ టీచర్ గీతా చనువు పెంచుకుంది. రానురాను ముత్తప్ప, గీతా అక్రమ సంబంధం పెట్టుకుని పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. క్లాస్ రూమ్ లు ఖాళీగా ఉన్న సమయంలో ఆ రూమ్ ల్లోకి వెలుతున్న ముత్తప్ప, గీతా గంటలు గంటలు రొమాన్స్ చేశారు.

 అదే స్కూల్ లో రెండో ప్రియుడు

అదే స్కూల్ లో రెండో ప్రియుడు

గీతా, ముత్తప్పల అక్రమ సంబందం చాలాకాలం నుంచి కొనసాగుతోంది. అదే స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం చేస్తున్న సంగనగౌడ అనే వ్యక్తితో గీతా చనువు పెంచుకుంది. గత నెలలో స్కూల్ లో పిల్లలు, టీచర్లు కలిసి మూడు రోజులు విహారయాత్రకు వెళ్లారు. విహారయాత్రకు వెళ్లిన సమయంలో పాత ప్రియుడు ముత్తప్పను దూరం పెట్టిన గీతా ఓ రోజు రాత్రి కొత్త ప్రియుడు సంగనగౌడతో రొమాన్స్ చేసింది.

 గీతా మీద కోపంతో ?

గీతా మీద కోపంతో ?

తాను పక్కరూమ్ లో ఉన్న సమయంలోనే గీతా సంగనగౌడతో ఎంజాయ్ చేసిందని ముత్తప్ప రగిలిపోయాడు. గీతాకు బుద్ది చెప్పాలని, ఆమె జీవితంలో మరో మగాడి వైపు కన్నెత్తికూడా చూడకుండా చెయ్యాలని స్కెచ్ వేశాడు. గీతాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను చంపేయాలని ముత్తప్ప రగిలిపోయాడు.

 టీచర్ అక్రమ సంబంధానికి కొడుకు బలి

టీచర్ అక్రమ సంబంధానికి కొడుకు బలి

గీతాకు అదే స్కూల్ లో నాలుగవ తరగతి చదవుతున్న భరత్ అనే కుమారుడు ఉన్నాడు. కొడుకు భరత్, కొత్త ప్రియుడు సంగనగౌడ, గీతా మీద అదే స్కూల్ లో ముత్తప్ప ఆ ముగ్గురి మీద ఇనుపరాడ్, కత్తితో దాడి చేశాడు. భరత్ ను స్కూల్ అంతస్తు మీద నుంచి కిందకు తోసేశాడు. తీవ్రగాయాలైన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. అయితే భరత్ చనిపోయాడని గదగ్ జిల్లా ఎస్పీ శివప్రసాద్ దేవరాజ్ మీడియాకు చెప్పారు.

 ఐసీయూలో లేడీ టీచర్

ఐసీయూలో లేడీ టీచర్

గీతాకు తీవ్రగాయాలు కావడంతో కిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంది. ఇంత చేసిన టీచర్ ముత్తప్ప తప్పించుకుని పారిపోయాడు. ముత్తప్ప కోసం పోలీసులు గాలించారు. హైదరాబాద్ పారిపోవడానికి ప్రయత్నించిన ముత్తప్ప గదగ్ సమీపంలోని రోణా క్రాస్ సమీపంలో చిక్కిపోయాడు. గీతా మీద వ్యామోహంతో తాను నాలుగో తరగతి అబ్బాయి భరత్ ను చంపేశానని, గీతా కుటుంబ సభ్యులను చంపడానికి ప్రయత్నించాడని నిందితుడు ముత్తప్ప అంగీకరించాడని గదగ్ జిల్లా ఎస్పీ శివప్రసాద్ దేవరాజ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+