ఏడు నెలలుగా కజిన్‌పై గ్యాంగ్ రేప్: ఇద్దరి అరెస్టు
థానే: మహారాష్ట్రలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఏడు నెలల పాటు తన కజిన్‌పై సామూహిక అత్యాచారం చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారంనాడు తెలిపారు. ఇద్దరు నిందితులను బుధవారంనాడు థానేలోని కాశ్మీరా ఏరియాలో అరెస్టు చేసినట్లు తెలిపారు.
బాధితురాలు బుధవారంనాడు తమకు ఫిర్యాదు చేశారని, వెంటనే నిందితులను అరెస్టు చేశామని కాశ్మీరా పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అనిల్ కదం చెప్పారు. బాధితురాలు నిందితులతో కలిసి జీవిస్తోంది. ఆ సమయంలో 36, 32 ఏళ్ల నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశారు. బాధితురాలిని వారిద్దరు కొడుతూ కూడా వచ్చారు. విషయాన్ని బంధువులకు చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ వచ్చారు. నాగపూర్‌కు చెందిన ఆ బాలిక తన పాఠశాల విద్యను ముగించిన తర్వాత రెండేళ్ల నుంచి వారితో కలిసి ఉంటోంది.
అత్యాచారం, అక్రమ నిర్బంధం, నేరప్రేరేపణ, కావాలని ఇబ్బంది పెట్టడం వంటి సెక్షన్ల కింద ఇద్దరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications