రెండు నెలల శిశువుకు 24 గంటల పోలీస్ భద్రత... కారణమిదే... ఎక్కడంటే...

గుజరాత్‌లో రెండు నెలల ఓ పసికందుకు పోలీసులు 24గంటల భద్రత ఏర్పాటు చేశారు. పుట్టిన రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు ఆ పసికందు అపహరణకు గురయ్యాడు. దీంతో పోలీసులు ఆ శిశువుకు నిరంతర భద్రత ఏర్పాటు చేశారు. బహుశా రాష్ట్రంలో 24 గంటల భద్రత పొందిన అతి పిన్న వయస్కుడు ఈ శిశువే అని చెబుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే... గుజరాత్‌ గాంధీనగర్‌లోని ఓ మురికివాడలో చెత్త ఏరుకుని జీవించే ఓ జంట నివసిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ జంటకు మగ శిశువు జన్మించాడు. బనస్కంత ప్రాంతంలోని గాంధీనగర్ సివిల్ ఆస్పత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. అయితే పుట్టిన రెండు రోజులకే శిశువు అపహరణకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... రంగంలోకి దిగిన పోలీసులు జిగ్నేష్,అస్మిత భారతి అనే జంట శిశువును ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.

two months baby kidnapped two times within two months police gives 24 hrs protection

వారం రోజుల్లోనే నిందితులను పట్టుకుని ఆ శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ ఘటన జరిగిన రెండు నెలలకు... జూన్ 5న ఆ శిశువు మరోసారి అపహరణకు గురైంది. సంతానం లేని దినేశ్-సుధా కటారా అనే దంపతులు శిశువును అపహరించారు. శిశువు తల్లి చెత్త సేకరించే సమయంలో... ఆమె సైకిల్‌కి ఏర్పాటు చేసిన చిన్నపాటి ఊయలలో ఆ పసికందును ఉంచారు. తల్లి చెత్త సేకరణలో నిమగ్నమవడంతో... అదే అదనుగా దినేశ్ దంపతులు శిశువును ఎత్తుకెళ్లారు. దీంతో శిశువు తల్లిదండ్రులు మరోసారి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు... అపహరణకు గురైన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కిడ్నాప్ అయిన నాలుగు రోజులకు ఎట్టకేలకు ఆ శిశువును తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. నిందితులు దినేశ్-సుధ దంపతులను అరెస్ట్ చేశారు. రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు అపహరణకు గురవడంతో... ఆ శిశువుకు 24 గంటల పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.

ఆ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తే అక్కడికి శిశువుకు భద్రతగా పోలీసులు కూడా వెళ్తున్నారు. ఆ కుటుంబం సురక్షితంగా నివసించేందుకు త్వరలోనే ఓ ఇంటిని కూడా కేటాయించే యోచనలో ఉన్నామని స్థానిక పోలీసులు తెలిపారు. ఏదైనా ఉపాధి లేదా వేరే ఉద్యోగం కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+