మరో ప్రధాన పార్టీ 'లెక్క' సరి చేసిన NDA, లిస్టులో నెక్స్ట్..!!

అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ నాయకత్వం వేగంగా రాజకీయ అడుగులు వేస్తోంది. తమ చేతికి మట్టి అంటకుండానే పని పూర్తి చేస్తోంది. బెంగాల్ లో మమతా పార్టీ నిలువునా చీలటం తో పాటుగా ఎన్డీఏ కు మద్దతుగా నిలవటంతో పార్లమెంట్ లో ఎన్డీఏ బలం పెరిగింది. ఇప్పుడు అదే విధంగా మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే పార్టీ ఎంపీలు ఎన్డీఏ వైపు చూస్తున్నారు. 'ఆపరేషన్ టైగర్' వేగ వంతం చేసారు. పలువురు ఎంపీలు ఎన్డీఏకు మద్దతు పలికేందుకు సిద్దమైనట్లు సమాచారం. దీంతో, ఇక నెక్స్ట్ వీరి లిస్టులో ఉన్న పార్టీ ఏంటనే చర్చ మొదలైంది.

మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) పక్షానికి చెందిన పలువురు లోక్‌సభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. 'ఆపరేషన్ టైగర్'పేరుతో సాగుతున్న ఈ పరిణామాల్లో భాగంగా.. శివసేన (UBT) ఎంపీలు బుధవారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే నివాసంలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ కీలక భేటీ అనంతరం వీరంతా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే కూడా స్వయంగా పాల్గొననున్నట్లు సమాచారం. యాంటీ డిఫెక్షన్ (పార్టీ ఫిరాయింపుల) చట్టం కింద అనర్హత వేటు పడకుండా ఉండాలంటే.. మొత్తం 9 మందిలో 2/3 వంతు అంటే కనీసం ఆరుగురు ఎంపీల మద్దతు అవసరం కానుంది.

రూటు మార్చిన పవన్, జనసేనలోకి వారికి ఆహ్వానం- బాలినేనికి బాధ్యతలు..!!
రూటు మార్చిన పవన్, జనసేనలోకి వారికి ఆహ్వానం- బాలినేనికి బాధ్యతలు..!!
uddhav-thackerays-sena-stares-at-major-setback-seven-mps-likely-to-break-away-here-the-details

పార్లమెంట్ లో పెరుగుతున్న ఎన్డీఏ బలం

దీంతో, ఈ ఎంలు ముందుగా లోక్‌సభలో ప్రత్యేక పక్షంగా ఏర్పడి, ఆపై జూన్ 19న 'శివసేన వ్యవస్థాపక దినోత్సవం' సందర్భంగా అధికారికంగా షిండే వర్గంలో విలీనం కావచ్చని తెలుస్తోంది. ఇటీవల ముంబైలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసం 'మాతోశ్రీ'లో జరిగిన అత్యవసర సమావేశానికి కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే వ్యక్తిగతంగా హాజరుకావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఐదుగురు ఎంపీలు ఈ భేటీకి దూరంగా ఉండటంతో ఉద్ధవ్ క్యాంప్‌లో గుబులు మొదలైంది. ఈ ప్రచారాన్ని శివసేన (UBT) ఫైర్‌బ్రాండ్ నాయకుడు సంజయ్ రౌత్ తీవ్రంగా ఖండించారు. పార్టీలో ఎలాంటి చీలిక లేదని, ఎంపీలంతా ఉద్ధవ్ ఠాక్రే వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. 'కొందరు వ్యక్తిగత, వైద్య కారణాల వల్లే మాతోశ్రీ సమావేశానికి రాలేకపోయారు, కానీ వారంతా వర్చువల్‌గా (ఆన్‌లైన్ ద్వారా) హాజరయ్యారు. విపక్షాలు మైండ్ గేమ్స్ ఆడుతున్నాయి. వారి 'ఆపరేషన్ టైగర్'కు కౌంటర్‌గా మేము 'ఆపరేషన్ వోల్ఫ్' ప్రారంభిస్తాం' అని రౌత్ హెచ్చరించారు. దీంతో.. ఈ రెబల్స్ వ్యవహారం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+