గుర్తు, గుర్తింపు లేకుండానే బరిలోకి 'ఉద్ధవ్ థాకరే'..!

మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 20న పోలింగ్ , నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం విసృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికలు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ కూడా గెలుపు గుర్రాలనే బరిలో దించాలని భావిస్తున్నాయి. 288 సీట్లున్న మహారాష్ట అసెంబ్లీలో 145 సీట్లు మెజార్టీ రావాల్సి ఉంది. ఒక్కసారి మహారాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే..

2019లో జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఏ పార్టీకి అండగా నిలవలేదు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ 105 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించగా, శివసేన పార్టీ -56 , ఎన్సీపీ - 54, కాంగ్రెస్ పార్టీ - 44 సీట్లు సాధించాయి. అధికారం కోసం శివసేన ,ఎన్సీపీ, కాంగ్రెస్ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్ థాకరేను ఉమ్మడి సీఎంగా ఎంపిక చేశారు.

Uddhav Thackeray s Strength and Weaknesses in Maharashtra Elections

అయితే కొద్ది కాలానికే మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. శివసేన మరియు ఎన్సీపీ పార్టీల్లో విభేదాలు చోటు చేసుకున్నాయి. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ షిండే ,ఎన్‌సీపీ అజిత్‌ పవార్‌.. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీతో చేతులు కలిపారు. దీంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది. అయితే శివసేన పార్టీ, గుర్తు తమదే అని ఏక్‌నాథ్‌ షిండే కోర్టుకు వెళ్లడం, ఆయనకు మద్దతుగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో ఉద్ధవ్ థాకరే రాజకీయ నిరాశ్రయులు అయ్యారు.

రాబోవు ఎన్నికలు ఉద్ధవ్ థాకరే‌కు చాలా కీలకమనే చెప్పాలి. తన తండ్రి స్థాపించిన పార్టీతో పాటు, ఆ పార్టీ గుర్తును కూడా ఉద్ధవ్ థాకరే పొగొట్టుకున్నారు. దీంతో ప్రస్తుతానికి కామన్ సింబల్‌తోనే పోటీ చేయడానికి ఉద్ధవ్ థాకరే రెడీ అవుతున్నారు. అయితే ఎటువంటి గుర్తు లేకపోయినప్పటికీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వానికి గట్టి షాక్ ఇస్తూ ఉద్ధవ్ థాకరే యొక్క సేన (UBT) ముంబైలో గణనీయమైన విజయాన్ని సాధించింది.

పార్టీ పేరు, గుర్తును కోల్పోయినప్పటికీ, బాల్ థాకరే వారసత్వానికి అతని వాదనను బలపరిచి, నాలుగు స్థానాలకు మూడు స్థానాలను గెలుచుకుంది. దీంతో ఉద్ధవ్ థాకరే ఫుల్ జోష్‌లో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.శివసేన పార్టీ, గుర్తు రెండు కోల్పోవడం ఉద్ధవ్ థాకరే మారుతాయని అంతా భావిస్తోన్న తరుణంలో , వాటినే తనకు అనుకూలంగా మార్చుకుని ఎన్నికలకు రెడీ అవుతున్నారాయన. మరి మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్ థాకరేకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+