వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలపరీక్షలో ఉద్దవ్ విజయం: 169 ఎమ్మెల్యేల మద్దతుతో సత్తా చాటిన కూటమి: బీజేపీ సభ్యుల వాకౌట్..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Uddhav Thackeray Govt Wins Trust Vote, BJP Walks Out || Oneindia Telugu

మహారాష్ట్ర అసెంబ్లీ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఉద్దవ్ థాక్రే బలం నిరూపించుకున్నారు. కాంగ్రెస్..ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివసేనకు బల పరీక్ష సమయంలో 169 మంది ఎమ్మెల్యే మద్దతు లభించింది. సుప్రీం తీర్పుకు ముందు రోజు ఒక హోటల్ లో 162 మంది సభ్యుల మద్దతు దారులతో పేరెడ్ చేయగా...ఇప్పుడు సభలో మరో ఏడుగురి సభ్యుల మద్దతు పెరిగింది. ఇదే సమయంలో.. సభ నుండి సభ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. ప్రొటెం స్పీకర్ తొలిగింపు..స్పీకర్ నియామకం విషయంలో బీజేపీ విభేదించింది. ఇక, కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసిన కామన్ మినిమమ్ ప్రోగ్రాం అమలు దిశగా పాలన సాగిస్తామని శివసేన నేతలు ప్రకటించారు. మెజార్టీ నిరూపించుకున్న సీఎం ఉద్దవ్ ను కూటమి నేతలు అభినందించారు.

మహారాష్ట్ర నెంబర్‌వన్ కావాలన్నదే లక్ష్యం, రైతులకు భారీ ఉపశమనం, తొలి క్యాబినెట్ సమావేశంలో ఉద్దవ్మహారాష్ట్ర నెంబర్‌వన్ కావాలన్నదే లక్ష్యం, రైతులకు భారీ ఉపశమనం, తొలి క్యాబినెట్ సమావేశంలో ఉద్దవ్

కూటమి సీఎం థాక్రేకు మద్దతుగా 169 మంది..

కూటమి సీఎం థాక్రేకు మద్దతుగా 169 మంది..

మహారాష్ట్రలో బల పరీక్షలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే గెలిచారు. సభలో మొత్తం 288 మంది సభ్యులు ఉండగా..ప్రభుత్వం నిలబడటానికి కావాల్సిన 144 మంది ఎమ్మెల్యేలు కంటే మరో 25 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఎక్కవే లభించింది. మొత్తం 288 స్థానాలకు గత మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సభ్యుల మద్దతు ఉంది. 29 మంది స్వతంత్ర సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం నిలబడా లంటే 145 మంది సభ్యులు మద్దతు కావాలి. అయితే తమకు 170 మంది సభ్యులకు పైగా మద్దతు ఉందని మహా వికాస్‌ ఆఘాడీ ప్రభుత్వం సభలో ప్రకటించింది. అయితే దీనికి ఒక్క ఎమ్మెల్యే తక్కువగా ఉధ్దవ థాక్రేకు మద్దతుగా 169 మంది మద్దతు బల పరీక్ష సమయంలో లభించింది.

సభ నుండి బీజేపీ వాకౌట్..

సభ నుండి బీజేపీ వాకౌట్..

బలపరీక్ష సమయంలో సభలో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ శాసనసభపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ కూటమి ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్‌ కొలంబకర్‌ను నియమించారని.. ఉద్ధవ్‌ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఫడ్నవీస్ ప్రభుత్వం సభ నిర్వహిస్తున్న తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదే సమయంలో విశ్వాస పరీక్షను ప్రారంభిస్తున్నామని, సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చోవాలని ప్రొటెం స్వీకర్‌ కోరారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఇటీవల మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఉద్ధవ్‌ సభకు పరిచయం చేశారు. కాగా కీలకమైన బలపరీక్ష నేపథ్యంలో అన్ని పార్టీలు సభ్యులకు విప్‌ జారీచేశాయి.

సభలో ఫైర్ అయిన ఫడ్నవీస్..

సభలో ఫైర్ అయిన ఫడ్నవీస్..

బల పరీక్ష ప్రారంభం సమయంలో మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రభుత్వం తీవ్రంగా విరుచుకుపడ్డారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్‌ కొలంబకర్‌ను నియమించారని.. ఉద్ధవ్‌ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆయన స్థానంలో ఎన్సీపీకి చెందిన దిలీప్‌ను నూతన ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా కనీసం వందేమాతరం కూడా ఆలపించలేదని ప్రభుత్వంపై పఢ్నవిస్‌ విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్‌ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విశ్వాస పరీక్షను ప్రారంభిస్తున్నామని, సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చోవాలని ప్రొటెం స్వీకర్‌ కోరారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

English summary
Udhav govt crosses majority mark as BJP MLAs walk out of assembly. Maha Vikas Aghadi got 169 mlas suppot in floor test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X