• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోడీ ప్రభుత్వ 'ఉజల': తక్కువ ధరకు ఇవ్వడమే కాదు, ఇదీ చేయాలి

By Nitin Mehta and Pranav Gupta
|

న్యూఢిల్లీ: పర్యావరణ ఆందోళనను తగ్గిస్తూ, తగినంత విద్యుత్ ఉత్పత్తి చేయడం భారత్‌కు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎనర్జీ పరిరక్షణ అత్యవసరాన్ని, ఎనర్జీ ఎఫిసియెంట్ ఎలక్ట్రానిక్ పరికరాల ఉపయోగాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లటం అత్యవసరం. ఇలా చేస్తే విద్యుత్ ఉపయోగం తగ్గుతుంది.

ఉన్నత్ జీవన్ బై అఫోర్డబుల్ ఎల్‌ఈడీ అండ్ అప్లియెన్సెస్ (ఉజల) కింద ప్రభుత్వం విద్యుత్ ఆదా చేసే పరికరాలను సబ్సిడీ కింద అందిస్తుంది. దేశవ్యాప్తంగా వీటిని అందిస్తోంది. ప్రస్తుతం ఎల్‌ఈడీ ల్యాంపులు, ట్యూబ్‌లైట్లు, ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్యాన్లను అందిస్తోంది.

ఉజలతో లాభం ఎలా?

ఉజల ద్వారా అందించే పరికరాలతో ప్రధానంగా మూడు లాభాలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. మొదటిది.. ఈ పరికరాలు ఉపయోగించడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.

విద్యుత్ ఆదా కారణంగా వినియోగదారులకు బిల్లు కూడా తక్కువ వస్తుంది. అదే సమయంలో పెద్ద మొత్తంలో విద్యుత్ ఆదా అవుతుంది.

రెండోది.. దేశవ్యాప్తంగా వినియోగించే విద్యుత్‌లో సగానికి పైగా బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అవుతోంది. దీని వల్ల వాతావరణం కాలుష్యం అవుతోంది. ఈ థర్మల్ ప్లాంట్లు పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సడ్‌ను విడుదల చేస్తాయి. విద్యుత్ ఆదా చేయడం వల్ల.. బొగ్గుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్ తగ్గుతుంది. తద్వారా కార్బన్ వాయుువుల ఉద్గారాలు కూడా తగ్గుతాయి.

మూడోది.. ఎల్‌ఈడీ ల్యాంబులు, ట్యూబ్‌ల ధరలు ఇదివరకు ఎక్కువ ధర ఉండేవి. ఉజల పథకం కింద వీటిని తక్కువ ధరకు అందిస్తున్నారు. ప్రభుత్వం ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకుంటోంది. తక్కువ ధరకు వినియోగదారులకు ఇస్తోంది.

ఉదాహరణకు, ల్యాంబ్ ధర ఫిబ్రవరి 2015లో రూ.315గా ఉంది. నవంబర్ 2016 నాటికి దాని ధర రూ.40 కంటే తక్కువగా ఉంది. దీంతో ఎల్‌ఈడీ లైట్ల రిటైల్ ధరలు కూడా కొద్ది నెలల్లో పడిపోయాయి.

బచత్ ల్యాంప్ యోజన (బీఎల్‌వై)

ఉజల పథకం కింద ఎల్‌ఈడీ ల్యాంపుల కంటే ముందు ప్రభుత్వం బచత్ ల్యాంప్ యోజన (బీఎల్‌వై) కింద సీఎఫ్ఎల్ ల్యాంపులు ఇచ్చింది. వాటిని తక్కువ ధరకు అందించింది.

ప్రభుత్వం ల్యాంప్స్ ధరను సేల్ ఆఫ్ సెర్టిఫైడ్ ఎమిషన్ రైట్స్ (సీఈఆర్) ద్వారా రికవర్ చేసుకునే అవకాశముంది. బిఎల్‌వైతో పోలిస్తే ఉజల పథకం పెద్దది.

పురోగతి ఎలా ఉంది?

ఇప్పటి వరకు, ప్రభుత్వం దేశవ్యాప్తంగా 23.5 కోట్ల ఎల్‌ఈడీ ల్యాంపులను సరఫరా చేసింది. స్థానిక నెట్ వర్క్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల ద్వారా అందించారు.

దీని ద్వారా ఇప్పటికే ఏడాదికి రూ.12,200 కోట్లు ఆదా అయింది. అలాగే, కర్భన పదార్థాల విడుదల చాలా వరకు తగ్గింది. 2.4 లక్షల టన్నుల కంటే ఎక్కువ తగ్గింది.

ఎల్‌ఈడీ ట్యూబ్ లైటన్లు, ఫ్యాన్ల సరఫరా అన్ని రాష్ట్రాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు 21 లక్షల ట్యూబ్ లైటన్లు, 8 లక్షల కంటే ఎక్కువ ఫ్యాన్లను ఉజల కింద ఇప్పటి వరకు అందించారు.

ఫైవ్ స్టార్ రేటెడ్ ఫ్యాన్లను తక్కువ ధరకు అందించారు. వీటిని రూ.1,100కు అందించారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.1,500గా ఉంది.

ముగింపు

బీఎల్‌వై లాగా ఉద్గారాల తగ్గింపుకు పవర్ మినిస్ట్రీ ఓ విధానాన్ని తీసుకు రావాలి. సీఈఆర్ సేల్ వినియోగదారులకు ఖర్చును మరింత తగ్గేలా చేస్తుంది. ఈ మూడు ఉత్పత్తులకు మించి ఉజల పథకం కింద మరిన్ని అందించే అవకాశం లేదని భావించవచ్చు.

ప్రభుత్వం అసలు లక్ష్యం మినిమమ్ గవర్నమెంట్, మాగ్సిమమ్ గవర్నెన్స్. కాబట్టి ఉజల పథకాన్ని ఈ ఎలక్ట్రానిక్ ప్రాడక్ట్స్‌కే పరిమితం చేయాలి. అలాగే, ఎనర్జీ పరిరక్షణపై ప్రజల్లో సంపూర్ణమైన అవగాహన తీసుకు రావాలి.

(నితిన్ మెహతా, రన్నితి కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ మేనేజింగ్ పార్ట్‌నర్. ప్రణవ్ గుప్తా ఇండిపెండెంట్ రీసెర్చర్)

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India faces a stiff challenge of building an adequate power generation capacity while addressing environment concerns. It becomes imperative for the country to promote energy conservation and use of energy efficient electronic products as it would reduce power consumption and lower the pressure for capacity expansion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more