Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నీరవ్ మోదీని అప్పగిస్తే ఏ జైలులో ఉంచుతారో చెప్పాలని కోరిన యూకే కోర్టు

భారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు నీరవ్ మోడీ కేసులో యూకే న్యాయస్థానం భారత్ ను ప్రశ్నించింది . నీరవ్ మోదీని భారత్ కు అప్పగించే విషయమై లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ చేపట్టారు. నీరవ్ మోదీని భారత్ కు అప్పగించాలని భారత్ కోరుతున్న నేపధ్యంలో ఆయనను అప్పగిస్తే ఏ జైల్లో ఉంచుతారో చెప్పాలంటూ కోరింది లండన్ వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు . పంజాన్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసును యూకే కోర్టు జూన్ 27కి వాయిదా వేసింది.

భారత్ కు అప్పగిస్తే నీరవ్ మోదీని ఏ జైలులో ఉంచుతారో చెపాలని కోరిన యూకే కోర్టు

భారత్ కు అప్పగిస్తే నీరవ్ మోదీని ఏ జైలులో ఉంచుతారో చెపాలని కోరిన యూకే కోర్టు

ఈ సందర్భంగా, నీరవ్ మోదీని అప్పగిస్తే అతడిని ఏ జైల్లో ఉంచుతారో చెప్పాలంటూ న్యాయస్థానం భారత్ ను కోరిన న్యాయస్థానం ఈ మేరకు భారత ప్రభుత్వానికి 14 రోజుల గడువు విధించింది. అయితే , భారత వర్గాలు నీరవ్ మోదీని ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని న్యాయమూర్తితో చెప్పినట్టు సమాచారం. రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ అప్పగింత విషయంలో స్థానిక వెస్ట్‌ మిన్‌స్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో చీఫ్‌ మేజిస్ట్రేట్‌ ఎమ్మా అర్బుథ్‌నాట్‌ ఎదుట గురువారం ప్రవేశపెట్టారు.

భారత్ సమర్పించిన నమూనా పత్రాలపై సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు

భారత్ సమర్పించిన నమూనా పత్రాలపై సంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు

నీరవ్‌పై చేపట్టనున్న విచారణకు సంబంధించి భారత అధికారులు సమర్పించిన నమూనా పత్రాలపై న్యాయమూర్తి ఎమ్మా సంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్‌ మాల్యా సహా పలువురి అప్పగింత కేసుల్లో గతంలో భారత బృందం సమర్పించిన పత్రాలతో పోలిస్తే నీరవ్ మోదీ విషయంలో సమర్పించిన పత్రాలు చాలా స్పష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. తాజా కేసుకు సంబంధించిన ఇతర వివరాలను ఆరు వారాల్లోగా సమర్పించాలని భారత్‌ను ఆమె కోరారు. వాటిని జులై 29న పరిశీలించనున్నారు .

లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో ఉన్న నీరవ్ మోదీ..

లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో ఉన్న నీరవ్ మోదీ..

నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం లో అరెస్ట్ అయిన నాటి నుండి వెస్ట్ లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో ఉన్నాడు. ఒక సంవత్సర కాలం పాటు అతని కోసం అనేక దేశాల్లో గాలింపు చేపట్టిన తర్వాత ఒక కొత్త బ్యాంకు ఖాతాను తెరవటానికి ప్రయత్నించి మెట్రో స్టేషన్ హోల్బోర్న్, సెంట్రల్ లండన్ లో అరెస్ట్ చేయబడ్డాడు . అప్పటి నుండి మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించి నీరవ్ మోడీ విఫలమయ్యాడు .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+