ఒకే ఒక్క గంట: రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి: కుప్పకూలిన మార్కెట్

ముంబై: స్టాక్ మార్కెట్‌ మళ్లీ పాతదారే పట్టింది. షేర్ మార్కెట్ కుప్పకూలిపోయింది. లక్షల కోట్ల రూపాయల మేర విలువ చేసే షేర్లు ఢమాల్ అయ్యాయి. దాదాపు అన్ని సెగ్మెంట్స్‌కు సంబంధించిన షేర్లన్నీ నెగెటివ్‌లో ట్రేడింగ్ అయ్యాయి. పేటీఎం షేర్లు పాతాళానికి పడిపోయాయి. రికార్డు స్థాయిలో క్షీణించాయి. అమ్మకాల ఒత్తిడి మార్కెట్‌పై తీవ్రంగా పడింది. మొత్తంగా 6.3 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరయింది. ఇదంతా తొలి గంటలోనే సంభవించడం మార్కెట్ వర్గాలకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

882 పాయింట్ల నష్టంతో..

882 పాయింట్ల నష్టంతో..

సెన్సెక్స్.. ఇవ్వాళ ఆరంభం నుంచే రెడ్ జోన్‌లో ట్రేడింగ్ అవుతూ వచ్చింది. ఏ దశలో కూడా అప్పర్ సర్కుట్‌లోకి వెళ్లలేదు. క్రమంగా రెండు గంటల వ్యవధిలో 922 పాయింట్ల నష్టానికి చేరుకుంది సెన్సెక్స్. ఉదయం 10:30 గంటల సమయానికి సెన్సెక్స్ 56,760 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీది కూడా ఇదే పరిస్థితి. తొలి గంటలో నిఫ్టీ 302 పాయింట్లను నష్టపోయింది. 16,903 పాయింట్ల ట్రేడ్ అయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కౌంటర్స్‌లల్లో భారీగా అమ్మకాలు సంభవించడమే దీనికి కారణంగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.

మరింత నష్టం రాకుండా..

మరింత నష్టం రాకుండా..

కొద్దిరోజులుగా మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోన్న విషయం తెలిసింది. వచ్చిన కాడికి అమ్మేసుకోవాలనే అభిప్రాయం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్లల్లో నెలకొంది. ఫలితంగా తమ స్టాక్స్ అన్నింటినీ అమ్ముకుంటూ వచ్చారు. ఇవ్వాళ అది తొలి మరింత ఉధృతమైంది. మార్కెట్ ఆరంభం నుంచే ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను అమ్ముకోవడానికి ప్రాధాన్యత ఇచ్చారు. మరింత నష్టపోకుండా ఉండేలా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు.

 రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్..

రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్..

స్టాక్ మార్కెట్ ఇవ్వాళ ఉదయం నుంచే పెద్ద ఎత్తున నష్టాలపాలు కావడానికి ప్రధాన కారణం.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులే. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మరింత తీవ్రతరం అయ్యాయి. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని డొనెట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను సర్వ స్వతంత్రంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన అనంతరం అమెరికా రంగంలోకి దిగింది.

ఈ రెండు రీజియన్లు ఇక స్వతంత్రంగా వ్యవహరిస్తాయంటూ పుతిన్ చేసిన ప్రకటన.. అమెరికాకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి అత్యవసర భేటీ కావడానికి దారి తీసింది.

నష్టాల్లో టాప్ షేర్లు

నష్టాల్లో టాప్ షేర్లు

మార్కెట్‌లో డ్రైవింగ్ ఫోర్స్‌గా చెప్పుకొనే షేర్లన్నీ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. అన్నీ రెడ్ మార్క్‌తో కనిపించాయి. ఎల్ అండ్ టీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్ర కంపెనీలకు చెందిన షేర్లు.. తొలి గంటలో టాప్ లూజర్స్‌గా నిలిచాయి. 2.94 శాతం మేర నష్టపోయాయి. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అన్ని సెక్టోరియల్ ఇండైసెస్.. లోయర్ సర్కుట్‌లో ట్రేడింగ్ అయ్యాయి. 2,413 స్టాక్స్ మైనస్‌లోకి వెళ్లిపోయాయి. 355 షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మరో 61 స్టాక్స్‌ ధరల్లో మార్పులు కనిపించలేదు.

ఇంట్రాడే ట్రేడింగ్ అంతా..

ఇంట్రాడే ట్రేడింగ్ అంతా..

బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఎక్కడే గానీ మార్కెట్ పుంజుకున్న దాఖలాలు తొలి గంటలో నమోదు కాలేదు. తొలి గంట నుంచే సెన్సెక్స్ గ్రాఫ్ నేలచూపులు చూడటం మొదలు పెట్టింది. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, మెటల్, రియల్ ఎస్టేట్స్ సెగ్మెంట్స్‌కు సంబంధించిన షేర్ల ధరలన్నీ దారుణంగా పడిపోయాయి. ఐటీ, ఆటో, మెటల్, పవర్, ఫార్మాసూటికల్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్.. ఇలా అన్ని సెగ్మెంట్స్ 2 నుంచి 4శాతం మేర నష్టపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+