వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుక్రెయిన్ ఎదురుదాడి: కీలక ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గుతున్న రష్యా దళాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
యుక్రెయిన్ ప్రతిదాడులు

యుక్రెయిన్ కీలకమైన తూర్పు పట్టణాల నుంచి రష్యన్ దళాలు ఉపసంహరించుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో యుక్రెయిన్ దళాల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.

తూర్పున రష్యా బలగాలకు కీలక సరఫరా కేంద్రమైన కుపియాన్‌స్క్‌లోకి శనివారం తమ దళాలు ప్రవేశించాయని యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

అయితే, రీగ్రూప్ కావడానికి తాము ఇజియం నుంచి నుంచి వైదొలిగామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దోన్యస్క్ వైపు నుంచి పూర్తి స్థాయిలో సహకారం పొందేందుకు కీలకపట్టణమైన బాలక్లియా నుంచి తమ దళాలను ఉపసంహరించుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

యుక్రెయిన్ దళాల దూకుడు ఇలాగే కొనసాగితే, ఏప్రిల్ కీయెవ్ నుంచి రష్యా తన దళాలను ఉపసంహరించుకున్న తర్వాత, ఇది అతి పెద్ద తిరోగమనం అవుతుంది.

ఈ నెల ఆరంభం నుంచి ప్రతిదాడి వ్యూహాలను మెరుగుపరిచిన తర్వాత, తాము 2 వేల చదరపు కిలోమీటర్ల మేర తమ ప్రాంతాలను రష్యా దళాల నుంచి విముక్తి కలిగించగలిగామని శనివారం రాత్రి చేసిన వీడియో ప్రసంగంలో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమీర్ జెలియెన్‌స్కీ అన్నారు.

జెలియెన్ స్కీ గురువారం నాడు చేసిన ప్రకటనలో విముక్తమైన ప్రాంతంలో సగభాగాన్ని కేవలం 48 గంటల్లోనే తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇజియం నుంచి తాము దళాలను ఉపసంహరించుకుందన్న రష్యా ప్రకటన చాలా కీలకమైంది. ఎందుకంటే ఇది రష్యాకు కీలకమైన సైనిక హబ్.

"రష్యన్ దళాలకు నష్టం జరగకుండా నిరోధించడానికి, శత్రువుపై శక్తివంతమైన శతఘ్నుల వర్షం కురిపించాం'' అని రష్యా దళాలు పేర్కొన్నాయి.

ఖార్కియెవ్ ప్రాంతంలో రష్యా ఆధీనంలో ఉన్న ప్రాంతాలలోని ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లాల్సిందిగా రష్యా నేతృత్వంలో పని చేస్తున్న స్థానిక అధికారి ప్రకటించారని రష్యన్ వార్తా సంస్థ టాస్ తెలిపింది.

వొలదిమీర్ జెలియెన్‌స్కీ

సరిహద్దు దాటేందుకు వీలుగా రష్యాకు ఆనుకుని ఉన్న బెల్గొరోడ్ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన వైద్యం, రేషన్, హీటింగ్ సదుపాయాలు సిద్ధంగా ఉన్నట్లు బెల్గొరోడ్ గవర్నర్ ప్రకటించారు.

రష్యా ఆక్రమిత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే సామర్థ్యం యుక్రెయిన్ సైన్యానికి ఉందనడానికి ఈ ఘటనలు సంకేతాలని నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు మిలిటరీ సాయం కోసం యుక్రెయిన్ ఇంకా పాశ్చాత్య దేశాలను అర్ధిస్తూనే ఉంది.

రష్యా దళాలను తమ దళాలు ఓడించగలవని, పాశ్చాత్య దేశాల ఆయుధ సహకారంతో ఈ యుద్ధాన్ని ముగించగలమని తాజా పరిణామా నేపథ్యంలో యుక్రెయిన్ విదేశాంగ మంత్రి, డిమిట్రో కులేబా వ్యాఖ్యానించారు.


ఉత్సాహంగా యుక్రెయిన్, దాని మిత్రదేశాలు

ఒర్లా గ్వెరిన్, సీనియర్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్, సెంట్రల్ యుక్రెయిన్

విశ్లేషణ

రష్యా దూకుడు ప్రతి దాడులతో యుక్రెయిన్ సమాధానం చెబుతున్న తీరుకు ఆ దేశ మిత్రులనే కాదు, పౌరులను కూడా ఆశ్చర్యపరిచింది.

రష్యా ప్రస్తుతం కీలకమైన సైనిక రవాణా హబ్‌లు ఇజియం, కుపియన్‌స్క్ తిరిగి యుక్రెయిన్ ఆధీనంలోకి వచ్చాయి. ఇది రష్యాకు నిజంగా ఎదురు దెబ్బే.

జర్నలిస్టులను యుద్ధప్రాంతంలోకి అనుమతించడం లేదు. యుద్ధానికి సంబంధించిన వ్యవహరాలను గోప్యంగా ఉంచడానికి యుక్రెయిన్ ప్రయత్నిస్తోంది.

అయినా, యుక్రెయిన్ సైనికులు తాము తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో జెండాలను ప్రదర్శిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి.

రష్యన్లు ఇప్పటికీ యుక్రెయిన్‌లో ఐదవ వంతుపై పట్టు సాధించారు. యుద్ధం త్వరలో ముగుస్తుందని కొందరు భావిస్తున్నారు. అయితే, యుక్రేనియన్లు తాము రష్యాను వెనక్కి మళ్లించగలమని చెప్పదలుచుకున్నారు. అయితే, రష్యాను ఓడించడం అంత సులభం కాదు. ఒక సైనికుడి అభిప్రాయం ప్రకారం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా అన్ని యూనిట్లనూ కోల్పోవడం ఇదే మొదటిసారి.


అంతకు ముందు రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలలో యుక్రెయిన్ సైన్యం దాదాపు 50 కిలోమీటర్ల వరకు చొచ్చుకు పోయినట్లు యూకే రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

''ఈ పరిణామంతో రష్యన్ దళాలు కూడా ఆశ్చర్యానికి గురయ్యాయి'' అని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

''ఈ ప్రాంతంలో రష్యన్ సైన్యం ప్రభావం స్వల్పంగానే ఉంది. యుక్రేనియన్లు తమ చాలా పట్టణాలను స్వాధీనం చేసుకోవడమో, చుట్టుముట్టడమో చేశాయి'' అని పేర్కొంది.

తూర్పు ప్రాంతంలో యుక్రెయిన్ ఎదురుదాడి ఈ వారం నుంచి కొనసాగుతోంది. అయితే, ఖేర్సన్ ప్రాంతంలో ఎదురు దాడి గురించి మాత్రమే ప్రపంచ దేశాలు అంచనాలు వేశాయి.

ఈ నగరాన్ని తన పట్టునుంచి జారిపోకుండా ఉండేందుకు రష్యా కొన్ని దళాలను దారి మళ్లించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే తూర్పు ప్రాంతంలో పట్టు సాధించడంతో పాటు దక్షిణాదిన కూడా యుక్రెయిన్ ముందడుగు వేస్తోందని ఓ అధికారి తెలిపారు.

దక్షిణ ప్రాంతంలో డజన్ల కిలోమీటర్ల మేర తమ సైన్యం పురోగమిస్తోందని యుక్రెయిన్ సైనిక కమాండ్ ప్రతినిధి నటాలియా గుమెన్యుక్ వెల్లడించారు.

యుక్రెయిన్ యుద్ధ దృశ్యాలు

అయితే, దక్షిణ ప్రాంతంలో పోరాడుతున్న రష్యన్ దళాలు తాము వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని, యుక్రెయిన్ దళాలు భారీ ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయని చెబుతున్నాయి.

ఖార్కియెవ్ నగరంలో రష్యా జరిపిన రాకెట్ దాడుల్లో శనివారం నాడు ఒక వ్యక్తి మరణించారని, అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని స్థానిక అధికారులు తెలిపారు.

యుక్రెయిన్ సేనలు జాతీయ జెండాను పట్టుకుని కుపియాన్‌స్క్ సిటీ హాల్ ముందు నిల్చున్నట్లుగా కనిపిస్తున్న ఫొటోను యుక్రెయిన్ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరి పాదాల దగ్గర రష్యా జెండా పడి ఉన్నట్లుగా ఫొటోలో కనిపిస్తోంది. యుక్రెయిన్ సేనలు నెమ్మదిగా కొత్త స్థావరాలను స్వాధీనంలోకి తీసుకుంటున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ శుక్రవారం చెప్పారు. దేశంలో తిరిగి యుక్రెయిన్ జెండాను పాతి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు. జాతీయ పోలీసు విభాగాలు రష్యన్ సేనలు వదిలిపెట్టిన స్థావరాలకు తిరిగి చేరుకుంటున్నారని చెప్పారు. యుక్రెయిన్ పౌరుల పై రష్యా పాల్పడిన యుద్ధ నేరాల గురించి ఫిర్యాదు చేయమని కోరారు. మాస్కో సేనలు యుద్ధ ఖైదీల పట్ల నియమాలను ఉల్లంఘించి ప్రవర్తించిన అనేక సంఘటనలను యుక్రెయిన్ లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణ బృందం నమోదు చేసినట్లు ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత జెలియెన్‌స్కీ ప్రకటన వెలువడింది. ఈ నివేదికలో యుక్రెయిన్ సేనలు కూడా యుద్ధ ఖైదీలను హింసకు గురి చేసి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Ukraine Counteroffensive: Russian Forces Pulling Back From Key Areas
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X