ఏ క్షణాన ఏం జరుగుతుందో: భారత ఎంబసీ ఖాళీ: ఆ అధికారుల కుటుంబాలు స్వదేశానికి

కీవ్: ఉక్రెయిన్‌లో కొద్ది రోజులుగా కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం తొలగిపోవట్లేదు. మరింత తీవ్ర రూపాన్ని దాల్చుతూనే ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఏర్పడిన వివాదం పరిష్కారానికి నోచుకోనంతగా ముదిరినట్టు కనిపిస్తోంది. దీనికోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా బరిలోకి దిగారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉక్రెయిన్‌లో నెలకొన్నాయి.

వెనక్కి తగ్గని రష్యా..

వెనక్కి తగ్గని రష్యా..

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చడానికి అమెరికా ఆ రెండు దేశాలతో సంప్రదింపులు నిర్వహించింది. ఆ చర్చలేవీ ఫలించలేదు. రష్యా వెనక్కి తగ్గలేదు. వైమానిక బలగాలను పెద్ద ఎత్తున మోహరింపజేసింది. సరిహద్దుల్లో శాశ్వత కట్టడాల నిర్మాణానికీ పూనుకుంది. ఈ పరిస్థితులన్నీ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందనే సంకేతాలను పంపించినట్టయింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలించింది రష్యా.

భారత్ హైఅలర్ట్..

భారత్ హైఅలర్ట్..

ఈ పరిణామాలతో భారత్ అప్రమత్తమైంది. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. కీవ్‌లోని రాయబార కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటోంది. రష్యా సైనిక చర్యకు దిగడమంటూ జరిగితే- అక్కడ ఏర్పడే పరిణామాలను అంచనా వేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే- ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే విషయం మీద ఆరా తీస్తోంది.

ఎంబసీ అధికారుల కుటుంబలు వెనక్కి..

ఎంబసీ అధికారుల కుటుంబలు వెనక్కి..

ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. రాజధాని కీవ్‌లోని రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయిస్తోంది. అక్కడ పని చేస్తోన్న అధికారుల కుటుంబాలను వెనక్కి పిలిపించుకుంటోంది. భారత ఎంబసీ అధికారుల కుటుంబాలు వెంటనే స్వదేశానికి రావాలని ఆదేశించింది. అత్యవసర ఉద్యోగులు మాత్రమే రాయబార కార్యాలయంలో విధుల్లో కొనసాగాలని సూచించింది. నాన్ ఎసెన్షియల్ ఆఫీసర్స్, ఎంప్లాయిస్ స్వదేశానికి రావాలని పేర్కొంది.

అమెరికా ఎంబసీ ఇదివరకే ఖాళీ..

అమెరికా ఎంబసీ ఇదివరకే ఖాళీ..

అమెరికా సైతం ఇదివరకే తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయించింది. కొంతమంది కీలక అధికారులు మినహా.. మిగిలిన వారందరినీ స్వదేశానికి పిలిపించుకుంది. ఎంబసీలో పని చేసే సాధారణ ఉద్యోగులు.. తమ కుటుంబాలతో సహా స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. ఉక్రెయిన్‌లో నివసిస్తోన్న తమ దేశ పౌరులు వెంటనే వెనక్కి రావాలని సూచించింది. వారికోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది.

విద్యార్థులు, భారత పౌరులు సైతం..

విద్యార్థులు, భారత పౌరులు సైతం..

ఉక్రెయిన్‌లో నివసిస్తోన్న భారత పౌరులు, విద్యార్థులు సైతం స్వదేశానికి రావాలంటూ కీవ్‌లోని రాయబార కార్యాలయం ఇదివరకే ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికోసం అడ్వైజరీని జారీ చేసింది. అత్యవసర పనుల కోసం ఉక్రెయిన్‌లో నివసించే భారతీయులు ఎప్పటికప్పుడు తమ సమాచారాన్ని రాయబార కార్యాలయానికి తెలియజేయాలని కోరింది.

రేపు ప్రత్యేక విమానాలు..

ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులు, పౌరులు స్వదేశానికి తీసుకుని రావడానికి ఎయిరిండియా రంగంలోకి దిగింది. మూడు విమానాలను నడిపించనుంది. ఈ నెల 22, 24, 26 తేదీల్లో ఈ విమానాలు ఉక్రెయిన్‌కు బయలుదేరి వెళ్తాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ సమీపంలోని బోరిస్పిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ఈ విమానాలు రాకపోకలు సాగిస్తాయి.

బుకింగ్స్ ఇటీవలే ఓపెన్..

బుకింగ్స్ ఇటీవలే ఓపెన్..

దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. తమ బుకింగ్ కార్యాలయాలు, వెబ్‌సైట్, కాల్ సెంటర్, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ప్రయాణికులు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని ఎయిరిండియా తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడే చిక్కుకోకుండా.. ముందుజాగ్రత్తగా స్వదేశానికి రాదలిచిన భారతీయ పౌరులు, విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+