భారత ఆర్ధిక వ్యవస్ధను దెబ్బకొడుతున్న ఉక్రెయిన్ వార్-ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఆరునెలలు దాటిపోయింది. అయినా ఇప్పటికీ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్ధితి. దీనికి ప్రధాన కారణం రష్యాతో పాటు దాన్ని వ్యతిరేకిస్తున్న పాశ్చాత్యదేశాలే. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర తప్పే అయినా, ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేయడం ద్వారా యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు పాశ్చాత్య దేశాలు కారణమవుతున్నాయి. దీంతో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇదే విషయాన్ని ప్రపంచ బ్యాంక్ కూడా తాజాగా స్పష్టంచేసింది.
బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఐఎంఎఫ్ ఇండియా మిషన్ హెడ్ నడా చవేరీ భారత ఆర్దిక వ్యవస్ధపై పడుతున్న విదేశీ ప్రభావంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాల్ని ఐఎంఎఫ్ 6.8 శాతానికి పరిమితం చేస్తూ నివేదిక ఇచ్చింది. మొత్తం మీద ఆశించిన దాని కంటే 0.6 శాతం అంచనాల్ని తగ్గించింది. ఇప్పుడు ఐఎంఎఫ్ హెడ్ కూడా అదే విషయాన్ని గుర్తుచేస్తూ భారత్ లో విధానపరంగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, విదేశీ పరిణామాల ప్రభావం ఆర్ధిక వ్యవస్ధపై పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు.

భారత్ లో పెరుగుతున్న ఆహార పదార్ధాల ధరల నియంత్రణ రిజర్వు బ్యాంకుకు కూడా సవాలుగా మారుతోందని ఐఎంఎఫ్ వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆశిస్తున్నట్లు ఐఎంఎఫ్ ఇండియా మిషన్ హెడ్ పేర్కొన్నారు. సెప్టెంబర్ లో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదునెలల గరిష్టానికి చేరుకుంది. దీంతో పాటు వరుసగా మూడో క్వార్టర్లో రిజర్వ్ బ్యాంక్ పరిమితి 6 శాతానికి మించి ద్రవ్యోల్బణం నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది రెపో రేటును ఏకంగా 190 బేసిస్ పాయింట్స్ పెంచింది. అయినా ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం లేదు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications