Parliament: పార్లమెంట్ దాడి వెనుక అసలు కారణమిదే-రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్..

భారత పార్లమెంట్ లోకి తాజాగా నలుగురు చొరబడి స్మోక్ గ్యాస్ తో కలకలం సృష్టించారు. ఏకంగా లోక్ సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకి బెంచీలపై పరుగులు పెట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ దృశ్యాలు చూసిన వారంతా షాక్ కు గురయ్యారు. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన పార్లమెంటులో జరిగిన ఈ చొరబాటు ఘటన తాజా భవనం భద్రతపై సైతం అనుమానాలు రేకెత్తించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ ఘటనపై భిన్నంగా స్పందించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న విధానాల వల్లే పార్లమెంట్‌ భద్రతా ఉల్లంఘన జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. నిరుద్యోగం దీని వెనుక ఉన్న కారణమని రాహుల్‌ తెలిపారు. మోడీ విధానాల వల్ల దేశంలోని పౌరులకు ఉపాధి లభించడం లేదని, నిరుద్యోగమే పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనకు కారణమని రాహుల్ విమర్శించారు. భారతీయ జనాభా ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని రాహుల్ గాంధీ అన్నారు.

umemployment behind parliament security breach, says rahul gandhi

ప్రధానమంత్రి మోడీ అనుసరిస్తున్న విధానాల వల్ల ఏర్పడిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పార్లమెంటు భద్రతా ఉల్లంఘనకు కారణమని రాహుల్ గాంధీ అన్నారు. భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీడియాతో మాత్రమే మాట్లాడతారని, కానీ సభలో మాత్రం దీనిపై ప్రకటన చేయరని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు భద్రతా ఉల్లంఘనను రాజకీయం చేస్తున్నాయని షా చేసిన వాదనపై అడిగిన ప్రశ్నకు ఖర్గే ఈ సమాధానం ఇచ్చారు.

అమిత్ షా కాంగ్రెస్ పేరు ప్రస్తావిస్తూ ఓట్లు అడుగుతాడని, నెహ్రూ, గాంధీజీ పేర్లను దుర్వినియోగం చేయడం ద్వారా ఓట్లు రాబట్టుకుంటాడని కాంగ్రెస్ ఛీఫ్ ఖర్గే ఆరోపించారు. 2001 పార్లమెంటు దాడి జరిగి 22వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 13న జరిగిన పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కేంద్రం, ప్రతిపక్షాలు వాగ్వాదానికి దిగాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిలో ఇద్దరికి విజిటర్స్ పాస్‌లు బిజెపి ఎంపి ప్రతిప్ సింహా పేరు మీద జారీ చేయడంతో కాంగ్రెస్,ఇతర ప్రతిపక్ష పార్టీలు బీజేపీని తప్పుపట్టాయి.

మరోవైపు పార్లమెంట్లోకి చొరబాటు ఘటనకు కీలక సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా గురువారం రాత్రి పోలీసులకు లొంగిపోయాడు. అలాగే పార్లమెంట్‌లోకి చొరబడిన ఇద్దరు సహా మొత్తం నలుగురు నిందితులను గురువారం 7 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. శుక్రవారం ఇదే తరహాలో లలిత్‌ను కూడా కస్టడీకి పంపారు. మరో నిందితుడు మహేష్ కుమావత్‌ను ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+