వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉమ్రాన్ మాలిక్: 150 KMPH కంటే ఎక్కువ స్పీడుతో వికెట్లు ఎగరగొట్టిన ‘కొత్త స్టార్’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించింది.

క్షణ క్షణానికి పరిస్థితులు మారిపోయాయి. హైదరాబాద్ గెలుస్తుందిలే అనుకునేసరికి మ్యాచ్ గుజరాత్ చేతుల్లోకి వెళ్లిపోయేది. గుజరాత్ విజయం ఖాయం అనుకునేలోగా హైదరాబాద్ విజృంభించేది.

Umran Malik

టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్‌ బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ (65 పరుగులు), మరక్రం (56 పరుగులు) అర్థ సెంచరీలు చేశారు. చివరి ఓవర్లో శశాంక్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి జట్టు స్కోరును 195కి తీసుకెళ్లాడు. శశాంక్ కేవలం ఆరు బంతులు మాత్రమే ఆడాడు. ఆఖరి ఓవర్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి హైదరాబాద్‌కు మంచి స్కోరు అందించాడు.

గుజరాత్ టీంలో వృద్ధిమాన్ సాహా 68 పరుగులు చేసి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేశాడు. చివరి ఆరు బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉండగా రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా నాలుగు సిక్సర్లు కొట్టి హైదరాబాద్ చేతుల్లోంచి విజయాన్ని లాగేసుకున్నారు.

ఈ మ్యాచ్ తరువాత ఒకే ఒక్క పేరు మారుమ్రోగిపోయింది. ఉమ్రాన్ మాలిక్.. సన్‌రైజర్స్ హైదరాబాదు తరపున ఆడిన ఈ బౌలర్‌కు క్రికెట్ అభిమానులందరూ నీరాజనాలు పలికారు.

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగుసార్లు 150 కిమీ కన్నా ఎక్కువ స్పీడ్‌తో బౌలింగ్ చేసి స్టంపులు ఎగరగొట్టాడు. మొత్తం అయిదు వికెట్లు తీసి అభిమానుల మనసు గెలుచుకున్నాడు.

జమ్మూకు చెందిన 22 ఏళ్ల ఉమ్రాన్ మాలిక్ తొలి మ్యాచ్ నుంచే 150 కిమీ కన్నా ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు.

గుజరాత్‌తో మ్యాచ్‌లో మాలిక్ తీసిన అయిదు వికెట్లలో నాలుగు క్లీన్ బౌల్డ్ అవుట్లే. అద్భుతమైన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు పర్పుల్ క్యాప్ రేసులో టాప్-10లో మాలిక్ లేడు. కానీ, ఇప్పుడు 15 వికెట్లతో రెండవ స్థానానికి చేరుకున్నాడు. మొదటి స్థానంలో 18 వికెట్లతో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన యుజ్వేంద్ర చాహల్ ఉన్నాడు. రెండవ స్థానంలో 15 వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్ ఉన్నారు.

అంతే కాకుండా, ఈ మ్యాచ్‌తో ఉమ్రాన్ ఐపీఎల్ 2022 టాప్-6 'మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్' జాబితాలోకి చేరాడు.

https://twitter.com/kamranali_jk/status/1519378891386671104

ఉమ్రాన్ మాలిక్‌పై పొగడ్తల వర్షం

క్రికెటర్లందరూ ఉమ్రాన్ మాలిక్‌పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. గుజరాత్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా, ఉమ్రాన్ వీపు చరుస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

అందరి నాలుకపై ఒకటే పేరు.. ఉమ్రాన్ మాలిక్.

https://twitter.com/bhogleharsha/status/1519368086352134145

మ్యాచ్ తరువాత క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే ట్వీట్ చేస్తూ, "కొందరు వేగులను జమ్మూకు పంపండి. అతడి (మాలిక్) లాంటి వాళ్లు అక్కడ ఇంకా చాలామందే ఉండి ఉంటారు" అని అన్నారు.

చెన్నై సూపర్‌కింగ్స్ ట్విట్టర్‌లో "ఈల వెయ్యి" (విజిల్ పోడు) ట్యాగ్‌తో ఉమ్రాన్‌ను ప్రశంసించింది.

https://twitter.com/ChennaiIPL/status/1519370211241066496

టెన్నిస్ దిగ్గజం మహేష్ భూపతి, "ఒక తార వెలిసింది" అంటూ ట్వీట్ చేశాడు.

క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్వీట్ చేస్తూ, "అద్భుతమైన క్రికెట్ మ్యాచ్!! ఉమ్రాన్ మాలిక్ అదరగొట్టాడు. కానీ ఒకే ఒక్క బౌలర్ మ్యాచ్‌ను గెలిపించలేడు. రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా బాగా ఆడారు" అన్నాడు.

https://twitter.com/Maheshbhupathi/status/1519369112681693188

"పేస్ కా మాలిక్ ఉమ్రాన్" (వేగానికి రాజు) అంటూ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు.

"ఐపీఎల్‌లో దొరికిన మరో ఆణిముత్యం ఉమ్రాన్ మాలిక్. ఈ మ్యాచ్‌లో అయిదు వికెట్లు తీశాడు. అతడు ప్రతీ మ్యాచ్‌కూ మెరుగవుతున్నాడు. అబ్బాయి..మంచి బౌలింగ్ చేస్తున్నావు" అంటూ హర్భజన్ సింగ్ మెచ్చుకున్నాడు.

https://twitter.com/IrfanPathan/status/1519369153421123584

సునీల్ గవాస్కర్ కూడా ఉమ్రాన్ బౌలింగ్‌ను ప్రశంసించాడు.

ఉమ్రాన్‌ మాలిక్‌కు ఆసియా కప్, ప్రపంచకప్ జట్టులో స్థానం కల్పించాలని అభిమానులు బీసీసీఐని డిమాండ్ చేశారు. అలాగే ఫిట్‌నెస్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్రాన్‌కు సలహా ఇచ్చారు.

గుజరాత్‌లో మ్యాచ్‌లో 150 కిమీ కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తూ అయిదు వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం ఉమ్రాన్ మాట్లాడుతూ టోర్నీ గెలవడమే తన లక్ష్యమని చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Umran Malik: The 'new star' who took wickets at speeds in excess of 150 KMPH
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X