ఘోర ప్రమాదం: పైకప్పు కుప్పకూలడంతో 21 మంది మృతి, శిథిలాల కింద మరికొందరు

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఘజియాబాద్‌లోని మురాద్‌నగర్‌లో వర్షం కారణంగా శ్మశాన వాటిక ఘాట్ కంప్లెక్స్‌లోని గ్యాలరీ పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 21 మంది మృతి చెందారు.

శిథిలాల కింద మరో 20 మందికిపైగా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్నవారిని బయటికి తీస్తున్నారు.

Under construction ceiling collapsed in Muradnagar, Ghaziabad: 15 killed

కాగా, శ్మశాన వాటికలో ఓ వ్యక్తి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. అంత్యక్రియలకు హాజరైన సుమారు 45 మంది బంధువులు వర్షం కారణంగా ఆ భవనం కింద నిల్చున్నారు. ఆ సమయంలోనే భవనం కూలడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఘటనలో గాయపడినవారిన హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+