అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ కు కరోనా పాజిటివ్ .. తీహార్ జైల్లోనే వైద్యం

అండర్ వరల్డ్ డాన్ , తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఛోటా రాజన్ కు కరోనా సోకింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తీహార్ జైలు వర్గాలు ప్రకటించాయి.

అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ కు కరోనా .. హై సెక్యూరిటీ సెల్ వద్ద సిబ్బంది క్వారంటైన్

అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ కు కరోనా .. హై సెక్యూరిటీ సెల్ వద్ద సిబ్బంది క్వారంటైన్

తీహార్ జైల్లో హై సెక్యూరిటీ సెల్ లో ఉన్న అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు . జైలు పరిపాలన అధికారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉంది. కరోనా లక్షణాలు కనిపించిన తరువాత చోటా రాజన్ కరోనా పరీక్ష చేయించుకున్నారు. దీంతో చోటా రాజన్ కు కరోనా సోకినట్లు తెలిసింది. అతనికి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిన తర్వాత , అక్కడ హై సెక్యూరిటీ సెల్ వద్ద విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందికి కరోనాపరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్ కు వెళ్ళమని ఆదేశించారు .

 ఛోటా రాజన్ కరోనా బారిన పడినట్లు ధ్రువీకరించిన తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్

ఛోటా రాజన్ కరోనా బారిన పడినట్లు ధ్రువీకరించిన తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్

ఛోటా రాజన్ కరోనా బారిన పడినట్లు తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ ధృవీకరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, ప్రస్తుతానికి ఛోటా రాజన్ ఆరోగ్యం బాగానే ఉంది . కొద్ది రోజుల క్రితం జైల్లోఅదే సెక్యూరిటీ సెల్‌లో బీహార్‌కు చెందిన బాహుబలి, మాజీ ఎంపి మహ్మద్ షాహాబుద్దీన్ కూడా కరోనా బారిన పడ్డారు. జైలు ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత వారికి కరోనా తగ్గకపోవటంతో వారిని దీన్‌దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు . వీరిద్దరినీ కూడా హై సెక్యూరిటీ సెల్‌లో ఉంచారు. ఇద్దరికీ భద్రత పటిష్టంగా ఉంది . కొద్దిమంది ప్రత్యేక జైలు సిబ్బంది మాత్రమే ఇద్దరిని కలుస్తున్నారు .

తీహార్ జైల్లో కరోనా పంజా .. పెరుగుతున్న కరోనా బాధిత ఖైదీలు

తీహార్ జైల్లో కరోనా పంజా .. పెరుగుతున్న కరోనా బాధిత ఖైదీలు

ప్రస్తుతం చోటా రాజన్ కూడా కరోనా లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించిన తరువాత జైల్లో ఖైదీలందరికీ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు . ప్రస్తుతం చోటా రాజన్ కు జైల్లోనే ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.


సాయుధ బలగాల పర్యవేక్షణలో గ్యాంగ్ స్టర్ ఛోటా రాజన్ కు కరోనా చికిత్స చేస్తున్నారు . కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీహార్ జైలు మీద కూడా పడింది . గతంలో మొదటి వేవ్ సమయంలో కూడా తీహార్ జైల్లో చాలా మంది ఖైదీలకు కరోనా సోకింది. ఇప్పుడు మరోమారు జైల్లో కరోనా విపరీతంగా ప్రబలుతుంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+