బడ్జెట్‌లో జైట్లీ ఏం చెప్పారంటే, పూర్తి వివరాలు: వారికి వరాలు, వీరి ఆశలు నీరుగారాయి
Recommended Video

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాసేపట్లో బడ్జెట్ 2018-19ను ప్రవేశ పెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదికి పైగా సమయం ఉంది. దీంతో వచ్చే ఏడాది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వానికి ఇది పూర్తిస్థాయి చివరి బడ్జెట్. దీంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగం, రైతులకు, గ్రామీణం, వైద్యానికి పెద్ద పీట వేశారు. జైట్లీ ప్రసంగం అనంతరం లోకసభ 5వ తేదీకి వాయిదా పడింది. ఆదాయపన్ను మినహాయింపు ఉంటుందని భావించినా ఊరట లభించలేదు.
#WATCH Finance Minister Arun Jaitley presents the Union Budget 2018-19 (Source:Lok Sabha TV) https://t.co/7TV5bIrAEH
— ANI (@ANI) February 1, 2018
Niti Aayog to establish a national programme to direct efforts towards Artificial Intelligence, including research and development of its applications: Arun Jaitley pic.twitter.com/Q1R7mRZkM7
— ANI (@ANI) February 1, 2018
Govt plans to construct 2 crore more toilets under Swachh Bharat Mission: Arun Jaitley #UnionBudget2018 pic.twitter.com/I5KpfLUpVT
— ANI (@ANI) February 1, 2018
బడ్జెట్ తయారీ ఇలా
ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో బడ్జెట్ ప్రకటనను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వతంత్ర సంస్థలకు పంపిస్తారు. నవంబర్ నెలలో వివిధ వాణిజ్య మండళ్లు, రైతులు, ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారులు చర్చిస్తారు. జనవరిలో బడ్జెట్ మండళ్లు తదితర సంఘాలతో ఆర్థిక మంత్రి సమావేశాలు నిర్వహించి, ప్రణాళికలు రూపొందిస్తారు.
నార్త్ బ్లాక్ కార్యాలయం
బడ్జెట్ రూపొందించే గ్రూప్‌లో ఉండే వారంతా ఢిల్లీలోని నార్త్ బ్లాక్ అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి పంపిస్తారు. వారికి అక్కడ ప్రపంచంతో సంబంధం ఉండదు. కుటుంబ సభ్యులతోను నేరుగా మాట్లాడే అవకాశం లేదు. ముందే, హల్వా వేడుక నిర్వహిస్తారు.
రహస్యంగా బడ్జెట్ ప్రసంగం
బడ్జెట్ ప్రసంగాన్ని రహస్యంగా ఉంచుతారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రెండు రోజుల ముందు ముద్రణకు ఇస్తారు. బడ్జెట్ పత్రాలను నార్త్ బ్లాక్‌లోని దిగువ భాగంలో ముద్రిస్తారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక నార్త్ బ్లాక్ కార్యాలయంలోని వారంతా బయటకు వస్తారు. బడ్జెట్ ముద్రణ సమయంలో బయటకు తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
బడ్జెట్ అనే పదం లేదు
రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదమే లేదు. వార్షిక ఆర్థిక పత్రంగా పేర్కొంటారు. వాడుకలో మాత్రమే అది బడ్జెట్ అయింది. బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీని నిర్ణయించి లోకసభ స్పీకర్‌కు ప్రతిపాదిస్తారు. ఆమోదం లభించాక లోకసభ సచివాలయం ఆమోదం కోరుతుంది. లోకసభలో ఆర్థిక మంత్రి ప్రవేశ పెడతారు. అంతకుముందే కేబినెట్‌కు సంక్షిప్తంగా వివరిస్తారు. ప్రధాని ఆమోదం తర్వాత రాష్ట్రపతికి పంపిస్తారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు దీనిపై చర్చ జరగదు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications