Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బడ్జెట్‌లో అరుణ్ జైట్లీ వరం: అందరకీ రూ. 5 లక్షల ఆరోగ్య బీమా

న్యూఢిల్లీ: వచ్చే బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశ ప్రజలకు ఓతీపి కబురు వినిపించే అవకాశం ఉంది. దేశ ప్రజలందరికీ రూ.5 లక్షల మేర ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఓ హిందీ పత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది.

ఆరోగ్య బీమాకు సంబంధించిన కేంద్ర పథకాలకు తన బడ్జెట్‌లో జైట్లీ రూ.5000 కోట్లు కేటాయించవచ్చునని చెబుతున్నారు. ఆరోగ్య బీమా పథకాలకు ఆ నిధుల నుంచి 60 శాతం కేటాయిస్తారని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా 40 శాతం భరించాల్సి ఉంటుంది

Union Budget 2018: Rs 5 lakhs insurance

దేశ ప్రజలందరికీ రూ. 5 లక్షల మేర ఆరోగ్య బీమాను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ ట్రస్టును ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని సమాచారం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి, రూ. 2 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి, రూ. 2 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్నవరికి వేర్వేరుగా కల్యాణ్, సౌభాగ్య, సర్వోదయ పథకాలన అమలు చేస్తారని ప్రబాత్ ఖబర్ తెలియజేసింది

దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. రూ 2 లక్షలకు లోపు వార్షికాదాయం ఉన్నవారికి నామ మాత్రం ప్రీమియం విధిస్తారు. ప్రస్తుతం దేశ జనాభాలో 4 శాతం మందికి మాత్రమే ఆరోగ్య బీమా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+