బడ్జెట్‌లో మహిళా సాధికారతకు పెద్దపీట.. మిషన్ శక్తి బలోపేతం
దేశంలో పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ . ఎస్సీ, ఎస్టీ లు, మహిళలు, వ్యవసాయ దారులకు ఈ 2022-23 బడ్జెట్ లో సముచిత స్థానం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళ, శిశు సంక్షేమ, సమగ్రాభివృద్ధి కోసం మూడు పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జీరో బడ్జెట్ ఫార్మింగ్, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. .
Recommended Video

మహిళలు, చిన్నారుల కోసం మూడు పథకాలు
మహిళల ఉన్నతికి కేంద్రం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంటులో 2022-23 బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళల అభ్యున్నతికి కేంద్రం తెచ్చిన పథకాల గురించి వివరించారు. మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ నేతృత్వంలో మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సమర్థ అంగన్ వాడీ -పోషణ్ 2.0 పథకాలను కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పునరుద్ధరించిందని వెల్లడించారు. మహిళ శక్తి ప్రాముఖ్యతను గుర్తిస్తూ మహిళలు, పిల్లల సమగ్రాభివృద్థి కోసం ఈ మూడు పథకాలను ప్రారంభించినట్లు సీతారామన్ తెలిపారు.

అంగన్ వాడీ కేంద్రాలు ఆప్‌గ్రేడ్
ఈ మూడు పథకాలు మహిళల మేధో , సామాజిక, ఆర్థిక వృద్ధి పెంపోందించడానికి దోహదపడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. బాలల ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇందు కోసం 2 లక్షల అంగన్ వాడీ కేంద్రాలను మరింత ఆప్‌గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు. పిల్లల అభివృద్ధి కోసం అంగన్ వాడీలను క్లీన్ ఎనర్జీతో మరింత మెరుగుపరచనునట్లు వెల్లడించారు.

మిషన్ శక్తి బలోపేతం
దేశ వ్యాప్తంగా లక్షలాది మహిళల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కేంద్రం కృషి చేస్తోందని నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రసంగించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా మిషన్ శక్తిని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. మిషన్ శక్తిని విజయవంతం చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమం దేశ నిర్మాణానికి ఎంతో సహాయపడుతుందని చెప్పారు.

జీరో బడ్జెట్ ఫార్మింగ్
ఆధునిక వ్యవసాయానికి ఊతం ఇచ్చేలా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వరి-గోదుమ కొనుగోళ్లు, మద్దతు ధరల కోసం రూ. 2.37 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా నేచురల్ ఫార్మింగ్ కారిడార్‌ను గంగా, పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. రానున్న 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ పునాది అని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహాకాలు అందిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు..
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications