Union Budget 2023-24:ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్: ఉద్యోగస్తులకు రిలీఫ్ దక్కుతుందా..?
ఢిల్లీ: 2022-23కు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ వాస్తవానికి వేతన జీవులను నిరుత్సాహపరిచింది. కరోనాతో అప్పటికే ఆర్థికంగా చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు బడ్జెట్ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని అప్పట్లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ సారి బడ్జెట్‌పై ఉద్యోగులు మంత్రి నిర్మలా సీతారామన్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి మంత్రివర్యులు వేతనజీవులపై కనికరిస్తుందా. ఆర్థికమాంద్యం కూడా ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తుండటంతో కేంద్రం ఎలాంటి చర్యలకు దిగుతోందనేది ఆసక్తికరంగా మారింది.
ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్
ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే నిర్మలమ్మ బడ్జెట్ ఈ సారి చాలా కీలకం కానుంది. 2023-24కు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లనుంది కేంద్రం. మరి బడ్జెట్‌లో అన్ని వర్గాల వారిని కేంద్రం ఆకట్టుకుని ఆకర్షించగలదా అనే చర్చ ప్రారంభమైంది. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ పై వేతన జీవులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కేంద్రం కూడా కరోనాతో వేతన జీవులకు పెద్ద బెనిఫిట్స్ ఇవ్వడం లేదంటూ స్పష్టం చేసింది. ఈ సారి ఆర్థికమాంద్యం కూడా దండెత్తుతుండటంతో వేతన జీవుల ఆశలు నిరాశే అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సారి కేంద్రం దీన్ని సాకుగా చూపే ఛాన్సెస్ ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే టాక్స్ ఎక్స్‌పెర్ట్స్ మాత్రం 2023-24 బడ్జెట్‌లో ఒక ఉద్యోగి స్థూల జీతంపై స్టాండర్డ్ డిడక్షన్‌లో పెంపు ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు వేతన జీవులకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.

పెరిగిన ధరలు
కరోనా తర్వాత ఆఫీసులు తిరిగి తెరుచుకోవడంతో ప్రస్తుతం అన్ని రంగాల్లో ధరలు పెరిగాయి. ఉదాహరణకు రవాణా ఛార్జీలు, అద్దెతో పాటు ఇతరత్రా ఛార్జీలు కూడా పెరిగాయి. కరోనా కొనసాగుతుందనే భావనతో చాలా కంపెనీలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలామంది నగరాల్లోని తమ ఇళ్లను ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోయారు. తిరిగి కరోనా కంట్రోల్ కావడంతో ఉద్యోగస్తులను ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఆయా కంపెనీలు డిసైడ్ అయ్యాయి.దీంతో వారంతా మళ్లీ నగరాలకు చేరుకున్నారు. వారు ఉండేందుకు ఒక ఇళ్లును అద్దెకు తీసుకుని అధిక అద్దెలు చెల్లిస్తున్నారు.ఈ క్రమంలోనే ఇంటి అద్దె నుంచి కూరగాయలు, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని ఉద్యోగస్తులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు.

స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటి..?
అన్ని పన్ను మినహాయింపులు పన్ను చెల్లింపుదారుని నిర్దిష్ట ఖర్చులపై ఉపశమనం పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలనే స్టాండర్డ్ డిడక్షన్ అని పిలుస్తారు. జీతం పొందే వ్యక్తులకు రవాణా భత్యం, మెడికల్ అలవెన్సులకు బదులుగా రూ.40వేలు స్టాండర్డ్ డిడక్షన్ కింద 2018-19 కేంద్ర బడ్జెట్‌లో తిరిగి ప్రవేశపెట్టింది. అంతకుముందు తాము చెల్లించే పన్నులో నుంచే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కింద రూ.19200, మెడికల్ అలవెన్స్ కింద రూ.15000 క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇది మొత్తంగా రూ.34,200గా ఉన్నింది. ఆ తర్వాత వరుసగా రెండు బడ్జెట్‌లలో స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.40వేలు, రూ.50వేలకు పెంచడం జరిగింది. ఇలా పెంచడంతో పన్ను చెల్లింపుదారు యొక్క మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది. తద్వారా పన్ను భారం తగ్గుతుంది. ఒక ఉద్యోగి స్థూల జీతం (gross salary)నుంచి తీసివేయబడుతుంది.ఈ మొత్తం స్టాండర్డ్ డిడక్షన్ సంబంధించిన ఖర్చులకు ఎలాంటి రుజువులు పొందపర్చాల్సిన అవసరం లేదు.

ఉద్యోగస్తులకు రిలీఫ్ దక్కుతుందా..?
ఇక మధ్యతరగతి వారికి వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటు గత మూడేళ్లుగా మారలేదు.మునుపటి సంవత్సరంలో, ప్రభుత్వం 'సరళీకృత పన్ను విధానం'ను ఒక ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టింది.ఇందులో పన్ను రేట్లు తగ్గించినప్పటికీ ఒక ఉద్యోగస్తుడు పొందాల్సిన చాలా డిడక్షన్స్ మరియు మినహాయింపులను ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది.నగదు ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వం కనీసం తక్కువ-ఆదాయ వర్గానికి స్పష్టమైన పన్ను తగ్గింపును ఈ సంవత్సరం ప్రకటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం వల్ల ఒక ఉద్యోగి టేక్-హోమ్-పే మెరుగుపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కొన్ని మినహాయింపులను ఉద్యోగులు క్లెయిమ్ చేయలేరని చెబుతున్నారు. మొత్తానికి 2023-24 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏమేరకు ఉద్యోగస్తులకు రిలీఫ్ ఇస్తుందో అనే అంశం చాలా ఆసక్తికరంగా మారింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications