Union Budget 2025: గురజాడ సూక్తిని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్
Union Budget 2025: లోక్‌సభలో వార్షిక బడ్జెట్ 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నిర్మలా సీతారామన్ సమావేశం కాగా.. రాష్ట్రపతి బడ్జెట్ సమర్పణకు ఆమోదం తెలిపారు. అనంతరం కేంద్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. "ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్" పేరుతో నిర్మల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
తొలి వ్యాఖ్యల్లో గురజాడ అప్పారావు సూక్తితో నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ గురజాడ అప్పారావు రాసిన సూక్తిని లోక్‌సభలో ప్రస్తావించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.

బడ్జెట్ లో అంశాలు
*అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి.. సున్నా శాతం పేదరికమే మా లక్ష్యం
* వికాస్ భారత్‌లో వంద శాతం క్వాలిటీ విద్య.
*2024-25లో ఎకానమీ వృద్ధి అంచనా 6.4 శాతం.
*2025-26కు అంచనా 6.3-6.8 శాతం.
*సబ్ కా వికాస్‌కు వచ్చే ఐదేళ్లు సువర్ణవకాశం.
*ఆరు రంగాల్లో సమూల మార్పులు.
*1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం.
*ఇన్‌ఫ్రా, మధ్యతరగతి ప్రజల వికాసమే లక్ష్యంగా ఐదేళ్ల ప్రణాళిక.
* పప్పుధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళిక.. ప్రయోగాత్మకంగా 10 జిల్లాల్లో పీఎం ధన్‌ధాన్య యోజన.
*కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంపు.. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే లోన్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు.
*బీహార్‌లో మఖనా రైతుల కోసం ప్రత్యేక బోర్డు.. మఖనా ఉత్పత్తి పెంచేలా బోర్డు ద్వారా శిక్షణ.
*ఎగుమతులు చేసే ఎంఎస్ఎంఈలకు రూ.20 కోట్ల వరకు రుణాలు.. ఎంఎస్ఎంఈలకు రుణ సదుపాయాలు పెంపు.. ఎంఎస్ఎంఈ రంగంలో 7.5 కోట్ల మంది కార్మికులు.
*ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం ప్రత్యేక పథకం-నిర్మలా సీతారామన్
*లాజిస్టిక్ వ్యవస్థగా ఇండియన్ పోస్ట్.. పోస్టల్ శాఖకు కొత్త రూపు ఇచ్చేలా ప్రణాళిక.
*ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రోత్సాహం.
*నేషనల్ మ్యాన్‌ఫ్యాక్షరింగ్ బోర్డు ఏర్పాటు.












Click it and Unblock the Notifications