దేశ చరిత్రలోనే నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. ఆదివారం రోజున కేంద్రబడ్జెట్.. ప్రత్యేకతలివే!
భారతదేశ చరిత్రలో తొలిసారి కేంద్ర బడ్జెట్ ను ఆదివారం రోజు ప్రవేశపెడుతున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను గతంలో లేని విధంగా ఆదివారం రోజున ప్రవేశపెట్టడం ఒక విశేషం. కేంద్ర బడ్జెట్ ను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టడం సాంప్రదాయంగా వస్తుంది.
ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ఇందుకే
ఈ క్రమంలోనే ఈసారి ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం వచ్చింది. దానిని అలానే కొనసాగిస్తూ ఆదివారం అయినప్పటికీ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగపరంగా చూస్తే ఆదివారం పార్లమెంటు సమావేశం నిర్వహించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఆదివారం కాకుండా బడ్జెట్ ను వాయిదా వేస్తే, తిరిగి ఆ ప్రక్రియను కొనసాగించడానికి అమలు చేయడానికి షెడ్యూల్ ఆలస్యం అవుతుంది.

చరిత్రలోనే తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్
సహజంగా మనకు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఏప్రిల్ ఒకటికి ముందే అన్ని ప్రక్రియలను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో తేదీ మార్చకుండా కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది. ఆదివారం రోజున బడ్జెట్ ను ప్రవేశపెట్టడం చరిత్రలోనే ఇది తొలిసారి. గతంలో 1999వ సంవత్సరంలో ఫిబ్రవరి 27వ తేదీన శనివారం రోజు బడ్జెట్ సమర్పణ జరిగింది.
1999బడ్జెట్ కూడా చారిత్రాత్మక బడ్జెట్
అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా అటల్ బీహార్ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో బడ్జెట్ సమర్పణ చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ ఆదివారం కావడంతో శనివారం బడ్జెట్ ను సమర్పించారు. అయితే అప్పటివరకు బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు సమర్పించేవారు. కానీ ఆ సంవత్సరం నుంచి ఉదయం 11 గంటలకు బడ్జెట్ షెడ్యూల్ మారింది. చరిత్రలో గుర్తుండిపోయిన బడ్జెట్ మార్పులు 1999వ సంవత్సరంలో జరిగాయి.
స్టాక్ మార్కెట్స్ ఓపెన్..
తాజాగా హిస్టరీలో నిలిచిపోయే బడ్జెట్ ను ఈ ఆదివారం ప్రవేశపెట్టడం విశేషం. అంతేకాదు స్వాతంత్ర్యం తర్వాత ఇదే తొలిసారి ఈ విధంగా ఆదివారం రోజున బడ్జెట్ ను ప్రవేశపెట్టడం మరో విశేషంగా చెబుతున్నారు. అలాగే సహజంగా ఆదివారం స్టాక్ మార్కెట్లకు సెలవు దినం, కానీ ఈరోజు ఆదివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లో పనిచేయడం చాలా అరుదైన విషయం.
తొమ్మిదోసారి నిర్మలమ్మ మార్క్ బడ్జెట్
ఈరోజు స్టాక్ మార్కెట్లు పనిచేయడానికి కూడా రెగ్యులర్ టైమింగ్స్ ఉంటాయి. ఇది మరొక విశేషంగా చెప్పవచ్చు. మొత్తంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు ప్రవేశపెట్టే బడ్జెట్ వరుసగా తొమ్మిదవ సారి ప్రవేశ పెడుతుండటం కూడా మరొక రికార్డుగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications