ఖాతాదారులకు కేంద్రం శుభవార్త
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ చిన్న వ్యాపారుల కోసం లో-వ్యాల్యూతో కూడిన భీమ్- యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించడానికి సరికొత్త పథకానికి ఆమోదం తెలిపింది. దీన్ని పర్సన్ టు మర్చంట్ (P2M) అంటారు. ఈ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం 1,500 కోట్ల రూపాయలతో ఈ పథకానికి రూపకల్పన చేసింది.
బుధవారం దేశ రాజధానిలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇది ఆమోదం పొందింది కూడా. చిన్న వ్యాపారులకు సంబంధించి 2,000 రూపాయల వరకు చేసే అన్ని పర్సన్-టు-మర్చంట్ లావాదేవీలకు ఎలాంటి ఫీజు లేదా మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఉండదు. పైగా 0.15 శాతం చొప్పున ప్రోత్సాహకం కూడా లభిస్తుంది.

ఈ పథకం ఏడాది పాటు అంటే వచ్చే ఏప్రిల్ 1వ తేదీన ఆరంభం అయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని త్రైమాసికాలకు వర్తిస్తుంది. క్లెయిమ్ మొత్తంలో 80 శాతం వరకు ఎలాంటి షరతులు లేకుండా ఈ మొత్తాన్ని ఆయా బ్యాంకులకు కేంద్రం అందజేస్తుంది.
రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం- అన్నిబ్యాంకులకు సంబంధంచిన కార్డ్ నెట్‌వర్క్‌ల ద్వారా నిర్వహించే లావాదేవీల్లో 0.90 శాతం వరకు మర్చంట్ డిస్కౌంట్ రిబేట్ అమలులో ఉంటోందనే విషయం తెలిసిందే. పర్సన్ టు మర్చంట్ విధానంలో ఈ కోత ఉండదు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం చూసుకుంటే యూపీఐ ద్వారా జరిగే పర్సన్ టు మర్చంట్ లావాదేవీల్లోనూ 0.30 శాతం వరకు మర్చంట్ డిస్కౌంట్ రిబేట్ అమలులో ఉంది. ఇప్పుడు దీని నుంచి ఉపశమనం లభించినట్టయింది ఖాతాదారులకు. 2,000 రూపాయల వరకు నిర్వహించే లావాదేవీల నుంచి ఈ కోతను మినహాయించింది కేంద్ర ప్రభుత్వం
ఇప్పుడు తాజాగా- డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా 2020 జనవరి నుండి- పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10ఏ, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269 ఎస్‌యూల్లో చేసిన సవరణల ద్వారా రుపే డెబిట్ కార్డు, భీమ్- యూపీఐ లావాదేవీలకు ఎలాంటి అదనపు వసూళ్లు చేయట్లేదు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications