మధ్యతరగతి ప్రజలకు తీపికబురు చెప్పిన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్!

మధ్య తరగతి ప్రజలకు తీపి కబురు చెప్పారు నకేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. మనదేశంలో నిర్దిష్ట ఆదాయాన్ని మించితే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో రెండు పన్ను విధానాలు అమలవుతున్నాయి. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం రెండిటిని అమలు చేస్తున్న కేంద్రం కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులను ఆకర్షించడం కోసం అనేక బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది.

పన్ను విధానంపై కీలక వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్
పాత పన్ను విధానంలో పన్ను రేట్లు యధాతధంగా ఉంచుతున్న కేంద్రం కొత్త పన్ను విధానాల మాత్రం టాక్స్ స్లాబులను కుదించింది ఇక పాత పన్ను విధానంతో పోలిస్తే కొత్త పన్ను విధానంలోనే ఎక్కువ పన్ను తగ్గించుకునే వెసులుబాటును కల్పించింది కేంద్రం. ఇక తాజాగా మరో మారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పన్ను విధానం పైన కీలక వ్యాఖ్యలు చేశారు.

Union Finance Minister Nirmala Sitharaman said govt trying to reduce tax rates to favor the middle class

పన్ను రేట్లను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న నిర్మలా సీతారామన్
ఈ కీలక వ్యాఖ్యల ద్వారా ఆమె మధ్యతరగతి వారికి శుభవార్త చెప్పారు. భవిష్యత్తులో పన్ను రేట్లు తగ్గిస్తారా అని అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన నిర్మల సీతారామన్ ఆదాయపు పన్నును సరళీకృతం చేయడంతో పాటు దానిని తగ్గించడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో కొన్ని కీలక మార్పులు చేసినట్టుగా కూడా ఆమె పేర్కొన్నారు.

పన్నులను సరళీకృతం చేసేందుకు కొత్త పన్ను విధానం
భవిష్యత్తులో మరింత మెరుగ్గా కొత్త పన్ను విధానాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. తాము 2019 నుండి ప్రత్యక్ష పన్నులను సరళీకృతం చేసేందుకు ప్రయత్నించామని, ప్రజల పైన భారాన్ని తగ్గించడం కోసమే కొత్త టాక్స్ విధానాన్ని తీసుకువచ్చామని నిర్మల సీతారామన్ చెప్పారు. 2024 బడ్జెట్ సమయంలో మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించేలా పన్ను రేట్లు కుదించామని గుర్తు చేశారు.

కొత్త పన్ను విధానంలోకి 78 శాతం మంది చెల్లింపుదారులు
తాము తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పటివరకు కొత్త పన్ను విధానంలోకి 78 శాతం మంది చెల్లింపుదారులు మారారని నిర్మల సీతారామన్ వెల్లడించారు. 7,75,000 వరకు ఆదాయంపైన నూతన పన్ను విధానంలో టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని, అదే పాత పన్న విధానంలో అయితే ఐదు లక్షలు దాటితే టాక్స్ చెల్లించాలని పేర్కొన్నారు. ఇక జీఎస్టీ కి సంబంధించి కూడా కీలక పన్ను రేట్లు తగ్గించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని నిర్మల సీతారామన్ ప్రకటన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+