వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వదేశీ కోవాగ్జిన్ కంటే..విదేశీ కోవిషీల్డ్ వైపే మోడీ సర్కార్ మొగ్గు: ఎందుకిలా? బఫర్ స్టాక్‌‌గా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన కరోనా వైరస్ వ్యాక్సినేషన్ మరి కొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ప్రారంభం కాబోతోంది. ప్రదానమంత్రి నరేంద్ర మోడీ దేశ రాజధాని నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతోన్నారు. ఉదయం 10:30 గంటలకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆరంభిస్తారు. ఒకేసారి.. ఒకే సమయానికి అన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సినేషన్ షురూ అవుతుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తొలివిడతలో మొత్తం మూడు లక్షలమందికి పైగా డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇస్తారు.

 మీడియా వ్యూహకర్తకు కీలక పదవి: వాల్ట్ డిస్నీ టు వైట్ హౌస్: గ్రాఫిక్స్ డిజైన్లలో ఎక్స్‌పర్ట్ మీడియా వ్యూహకర్తకు కీలక పదవి: వాల్ట్ డిస్నీ టు వైట్ హౌస్: గ్రాఫిక్స్ డిజైన్లలో ఎక్స్‌పర్ట్

కోటికి పైగా కోవిషీల్డ్ డోసులు..

కోటికి పైగా కోవిషీల్డ్ డోసులు..

వ్యాక్సినేషన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం.. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను వినియోగించబోతోంది. ఈ రెండు వ్యాక్సిన్లు ఆయా రాష్ట్రాల్లోని డిజిగ్నేటెడ్ స్టాక్ పాయింట్లకు ఇప్పటికే అందాయి. వ్యాక్సినేషన్ కోసం కోటి 10 లక్షలకు పైగా కోవిషీల్డ్ డోసులను కేంద్ర ప్రభుత్వం వినియోంచుకోబోతోంది. అదే సమయంలో 50 లక్షలకు పైగా కోవాగ్జిన్ టీకాలను సిద్ధం చేసింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్. పుణేకు చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ దీన్ని తయారు చేస్తోంది. అక్కడి నుంచే ఈ వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాలకు చేరవేశారు.

 హైదరాబాదీ భారత్ బయోటెక్..

హైదరాబాదీ భారత్ బయోటెక్..

మరో టీకా.. కోవాగ్జిన్‌ను ‌హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసింది. వ్యాక్సినేషన్ సందర్భంగా పెద్ద ఎత్తున వినియోగానికి కోవాగ్జిన్ కంటే.. కోవిషీల్డ్ వైపే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ రెండు వ్యాక్సిన్లు ఒకేరకమైన ప్రభావాన్ని చూపుతాయని భావించినప్పటికీ.. కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్‌కు సంబంధించిన మెడికల్, క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తొలుత ఆమోదించడం వల్లే ఈ వ్యత్యాసం కనిపించినట్లు చెబుతున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు సహా..

రెండు తెలుగు రాష్ట్రాలు సహా..

ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాలు కోవాగ్జిన్‌ను బఫర్ స్టాక్‌గా మాత్రమే వినియోగించుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. వ్యాక్సినేషన్ సందర్భగా డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్లకు కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, బిహార్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర.. వంటి కొన్ని రాష్ట్రాలకు కోవాగ్జిన్ డోసులు తక్కువగా అందినట్లు చెబుతున్నారు. బఫర్ స్టాక్‌గా దీన్ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

 మూడో విడత క్లినికల్ ట్రయల్స్ ఎఫెక్ట్..?

మూడో విడత క్లినికల్ ట్రయల్స్ ఎఫెక్ట్..?


క్లినికల్ డేటా ఆలస్యంగా అందడం, మూడో విడత క్లినికల్ ట్రయల్స్ వివాదాస్పదం కావడం వంటి కారణాలే దీనికి దారి తీశాయని సమాచారం. ఢిల్లీకి మొత్తం 2,54,54 లక్షల కోవిషీల్డ్ డోసులు అందగా.. 20 వేల డోసులు మాత్రమే కోవాగ్జిన్ సరఫరా అయిందని తెలుస్తోంది. ఇదే పరిస్థితి ఏపీ సహా మరి కొన్ని రాష్ట్రాల్లో నెలకొందని అంటున్నారు. కోవిషీల్డ్‌ను డిఫాల్ట్ ఆఫ్షన్‌గా కేంద్రం ప్రకటించిందని నీతి ఆయోగ్ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు కూడా తొలి ప్రాధాన్యతగా కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌నే అందజేయాల్సి ఉంటుందంటూ కేంద్రం స్పష్టీకరించినట్లు చెబుతున్నారు.

English summary
States like Delhi, Andhra Pradesh, Telangana, Punjab are going to use Serum Institute of India’s Covishield to vaccinate their healthcare and frontline workers in the first phase, while keeping Bharat Biotech’s Covaxin as a “buffer stock”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X