దిగివస్తున్న కేంద్రంలోని పెద్దలు, యడియూరప్ప కొడుకుతో చర్చలు, అదే జరిగితే !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో అనేక మార్పులు తీసుకురావాలని బీజేపీ ఆలోచిస్తోంది. కర్ణాటకలో రాజకీయంగా బీజేపీ ప్లాన్ లు తారుమారు అయ్యాయి. ఇదే ససయంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బీ.వై. విజయేంద్రతో చాలా సేపు మాట్లాడటం కర్ణాటక రాజకీయాల్లో కుతూహలం రేపింది.
కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బీ. ఎస్. యడియూరప్ప కుమారుడు అయిన బీ. వై. విజయేంద్ర అమిత్ షాతో భేటీ అయిన ఫోటోలను ట్వీట్ చేశారు. బీజేపీలో రాజకీయ చాణక్యుడిగా అభివర్ణించే హోమ్ మంత్రి అమిత్ షా జీని కలిశాను, వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయడంతోపాటు రాష్ట్రంలో వైఫల్యాలకు పూనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మార్గనిర్దేశం చేశారని విజయేంద్ర ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ప్రతిపక్ష నేతను ఎన్నిక చెయ్యడం బీజేపీకి సాధ్యం కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదం లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకూడదని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే రాష్ట్ర నేతలకు ఆదేశాలు ఇచ్చిందని, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉండటం, పలువురు నాయకులు మాకు ఆ పదవి కావాలని బహిరంగంగానే డిమాండ్లు చెయ్యడాన్ని బీజేపీ హైకమాండ్ గమనిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో యడ్యూరప్ప ద్వారా మళ్లీ ఓటు బ్యాంకును దక్కించుకునేందుకు కర్ణాటకలో విజయేంద్ర నాయకత్వాన్ని బలపరచాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయని. ఇదే సమయంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో యడియూరప్ప కుమారుడు విజయేంద్ర కలవడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications