ఇక కోర్టులోనే: స్టేషన్ బెయిల్ విధానం రద్దు
న్యూఢిల్లీ: కొన్ని కేసుల విషయంలో పోలీస్ స్టేషన్‌లోనే బెయిల్ ఇచ్చే విధానానికి కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. ఇందు కోసం సీఆర్‌పీసీ 41ఎకు కేంద్ర న్యాయశాఖ సవరణ చేసింది. దాని ప్రకారం ఇకపై బెయిల్ కావాలంటే నిందితులు కోర్టుకు వెళ్లక తప్పదు.
స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తప్పనిసరిగా కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చాలి. స్టేషన్ బెయిల్స్‌లో అవకతవకలు జరుగుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్న క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇంతవరకు ఉన్న నిబంధనల ప్రకారం, కొన్ని చిన్న కేసుల విషయంలో స్టేషన్ హౌజ్ ఆఫీసరే బెయిల్ ఇచ్చేలా అధికారాలు ఉన్నాయి.

ఉగ్రవాది భట్ కు నేడు లై డిటెక్టర్ పరీక్ష
ఢిల్లీ: ఉధంపూర్‌లో బీఎస్ఎఫ్ బస్సుపై దాడి ఘటనలో అరెస్టయిన ఉగ్రవాది షౌకత్ అహ్మద్ భట్ కు మంగళవారం సత్యశోధన పరీక్ష నిర్వహించనున్నారు. ఢిల్లీలోని సీఎఫ్ఎస్ఎల్ లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఏ స్థాయిలో కుట్రలు పన్నిందో తెలుసుకోవాలంటే నిందితునిపై ఈ పరీక్ష నిర్వహించడం అవసరమని ఎన్ఐఏ భావించింది.
పొంతనలేని సమాచారాన్ని చెబుతుండడంతో దర్యాప్తునకు అంతరాయం కలుగుతోందని సత్యశోధన పరీక్ష కోసం కోర్టును ఆశ్రయించింది ఎన్ఐఏ.. కోర్టు అనుమతినివ్వడంతో మంగళవారం ఈ పరీక్ష నిర్వహించనున్నారు..












Click it and Unblock the Notifications