Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చైనాతో సరికొత్త వివాదం: ఘాటుగా స్పందించిన కేంద్రం

Arunachal Pradesh: చైనా.. మరోసారి భారత్‌పై విషాన్ని కక్కింది. వాస్తవాధీన రేఖ, సరిహద్దు పొడవునా తరచూ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణానికి కారణమౌతూ వస్తోన్న ఈ డ్రాగన్ కంట్రీ అలాంటి తెంపరితనాన్నే ప్రదర్శించింది. సరికొత్త వివాదానికి బీజం వేసింది. భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరించింది.

గతంలో అరుణాచల్ ప్రదేశ్ మొత్తాన్నీ తనలో కలిపేసుకున్నట్లు మ్యాప్‌లను విడుదల చేసింది చైనా. అరుణాచల్ ప్రదేశ్ భూభాగం మొత్తం తమ దేశంలో ఉన్నట్లుగా చూపించింది. చైనా భూభాగం అస్సాం సరిహద్దుల వరకూ విస్తరించినట్టు చూపించింది ఆ మ్యాప్. కేంద్ర పాలిత పాంతం లఢక్ సమీపంలో భారత్- చైనా వాస్తవాధీన రేఖ వద్ద గల వివాదాస్పద ప్రాంతం అక్సాయ్ చిన్‌ రీజియన్‌ను కూడా తమ దేశ భూభాగంగా చూపించింది.

Union Minister Kiren Rijiju condemn China s names given to 30 places inside Arunachal Pradesh

ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 30 ప్రాంతాలకు తమ దేశ పేర్లను పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మరోసారి స్పష్టం చేసింది. ఆ రాష్ట్రాన్ని దక్షిణ టిబెట్‌లో ఓ భాగంగా వాదించేలా తాజా చర్యలను తీసుకుంది. అరుణాచల్‌ను ఝాంగ్నన్ అని నామకరణం చేసింది.

అరుణాచల్‌లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడం ఇది నాలుగోసారి. 2017లో- ఆరు, 2021లో- 15, 2023లో- 11 ప్రాంతాలను తమవిగా చెప్పుకొంది. వాటికి తమ దేశ పేర్లను పెడుతూ మ్యాప్‌లను విడుదల చేసింది. ఈ పేర్ల మార్పు- మే 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయనీ పేర్కొంది.

దీనీపై కేంద్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ చర్యలను తప్పుపట్టారు. అరుణాచల్ ప్రదేశ్.. ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని తేల్చి చెప్పారు. తమ రాష్ట్రంలో 30 ప్రదేశాలకు చైనా పేర్లు పెట్టడం చట్టవిరుద్ధమని అభివర్ణించారు.

భౌగోళికంగా గానీ, చారిత్రాత్మకంగా అరుణాచల్ ప్రదేశ్‌పై చైనాకు ఎలాంటి హక్కూ లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రాంత భూభాగం తమదేనని చైనా వాదించడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. పేర్లు పెట్టినంత మాత్రాన చారిత్రక వాస్తవాలను మార్చలేమని తేల్చి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్.. భారత్‌లో విడదీయరాని భాగమని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+