సీఎంకు షాక్ ఇవ్వడానికి రంగంలోకి దిగిన కేంద్ర మంత్రి, శోభక్క దెబ్బకు మైండ్ బ్లాక్!

కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో లోక్‌సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. కర్ణాటకలోని 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో 28 స్థానాల్లో విజయం సాధించడం ద్వారా అధికార కాంగ్రెస్‌కు సవాల్‌ విసిరేందుకు కాంగ్రెస్‌ పార్టీతో పాటు పలువురు నేతలను బీజేపీ టార్గెట్‌ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తేదీ ఇప్పటికే ప్రకటించడంతో ఎన్నికల ప్రచారం, నాయకుల పార్టీ జంపింగ్స్ ఎక్కువ అయ్యాయి.

లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తమ అభ్యర్థుల తరఫున జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీల నేతలు కూడా ప్రచారాలతో పాటు వ్యూహాలు రచిస్తున్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని ఢీకొనేందుకు కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్న నేతలతో సంప్రదింపులు జరుపుతున్న బీజేపీ నేతలు వారికి కమలం కండువాలు కప్పడానికి రంగం సిద్దం చేస్తున్నారు.

Union Minister Shobha Karandlaje has appealed to former Bengaluru Congress MLA to join BJP

ఇదే సమయంలో బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాస్ లీడర్ అఖండ శ్రీనివాసమూర్తిని బీజేపీలోకి ఆహ్వానించారని తెలిసింది. బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే రంగంలోకి దిగారు. బెంగళూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తిని కలిసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే అహిందా అస్త్రంతో పాటు దళితుల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని, ఇప్పుడు కాంగ్రెస్‌పై దళితుల అస్త్రాన్ని ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమైందని, అందుకే ఒక్క అడుగు ముందుకు వేసిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి వెళ్లి ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలిసింది. అలాగే అఖండ శ్రీనివాస్ మూర్తితో చర్చలు జరిపిన బీజేపీ నాయకులు ఆయన్ను బీజేపీలో చేరాలని చెప్పారని సమాచారం.

Union Minister Shobha Karandlaje has appealed to former Bengaluru Congress MLA to join BJP

బెంగళూరుకు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించడమే కాకుండా ఆయనకు బీజేపీ భారీ ఆఫర్ ను కూడా ఇచ్చిందని తెలిసింది. దాని ద్వారా బీజేపీలో చేరేందుకు అఖండ శ్రీనివాసమూర్తిని ఒప్పించారని తెలిసింది. బీజేపీలోకి వస్తే రాబోయే రోజుల్లో మీకు పార్టీలో సముచిత పదవులు కల్పిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తికి హామీ ఇచ్చినట్లు సమాచారం.

2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ శ్రీనివాసమూర్తికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించారని, ఆ సమయంలో దళితులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అఖండ శ్రీనివాసమూర్తికి చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది తరువాత భారతీయ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నుంచి పోటీ చేసిన అఖండ శ్రీనివాసమూర్తి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పటికైనా లోక్‌సభ ఎన్నికల సమయంలో అఖండ శ్రీనివాసమూర్తి బీజేపీలో చేరితే కాంగ్రెస్‌పై దళితుల అస్త్రాన్ని ప్రయోగించవచ్చనేది బీజేపీ లెక్కలు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+