షాకింగ్ : సెకండ్ హ్యాండ్ కారు కోసం... 3 నెలల పసికందును అమ్మేసిన తల్లిదండ్రులు

ఉత్తరప్రదేశ్‌లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కేందుకు ఓ జంట ఏకంగా 3 నెలల తమ పసిబిడ్డను అమ్మేసింది. శిశువు అమ్మమ్మ,తాతయ్య దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఒక కారు కోసం కన్నబిడ్డనే అమ్మేసిన ఆ తల్లిదండ్రులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే... కన్నౌజ్ పట్టణంలోని తిర్వా కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దంపతులు నివసిస్తున్నారు. మూడు నెలల క్రితం వీరికి మగ బిడ్డ జన్మించాడు. ఇటీవల గుర్సాహైగంజ్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఆ దంపతులు తమ పసిబిడ్డను అమ్మేశారు. రూ1.5లక్షలకు బేరం కుదుర్చుకుని కన్న కొడుకుని విక్రయించారు. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారు.

UP couple sells 3-month-old son to buy second-hand car

కేవలం కారు కొనుక్కోవాలన్న ఉద్దేశంతోనే ఆ దంపతులు తమ కన్న కొడుకును అమ్మేసినట్లు శిశువు అమ్మమ్మ,తాతయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ పసిబిడ్డ సదరు వ్యాపారవేత్త వద్దే ఉన్నాడని... అతన్ని,అతని భార్యను విచారణకు రావాల్సిందిగా కోరామని చెప్పారు. ఆ వ్యాపారవేత్త నుంచి తీసుకున్న డబ్బుతో ఆ దంపతులు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్న మాట వాస్తవమేనని చెప్పారు. కారు కోసమే బిడ్డను అమ్ముకున్నారా అన్నది విచారణలో తేలుతుందన్నారు.

Recommended Video

    Raghurama Krishnam Raju బర్త్ డే రోజు అరెస్ట్.. Ys Jagan గట్టి దెబ్బ కొట్టాడు!! || Oneindia Telugu

    రెండు నెలల క్రితం తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఆడబిడ్డ పుట్టిన 15 రోజులకే ఓ తల్లి ఆ పసికందును రూ.35వేలకు విక్రయించింది. మిరుదొడ్డి మండలం మల్లంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ పసికందుకు టీకా వేసేందుకు స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త ఆ మహిళ ఇంటికి వెళ్లగా...ఈ విషయం బయటపడింది. పాపను విక్రయించిన విషయాన్ని చెప్పిన ఆ మహిళ... ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అంగన్‌వాడీ కార్యకర్తను బతిమాలింది. దీనిపై శిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదు అందడంతో అధికారులే నేరుగా రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+