యూపీలో మరో దారుణ ఘటన-వాంగ్మూలం ఇస్తుందని దళిత మైనర్ రేప్ బాధితురాలికి ఉరి..
ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బారాబంకిలోని హైదర్ ఘర్ లో నివసిస్తున్న ఓ దళిత మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఆమెను మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఆ లోపే ఆమె ఇంట్లోనే ఉరేసుకుని కనిపించింది. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
బారాబంకిలో అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కేసు దర్యాప్తు అధికారిని సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, "హైదర్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో జూన్ 17 న రేప్ కేసు నమోదైందని, నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అలాగే బాలిక తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి మేజిస్ట్రేట్ ముందు ఇవాళ హాజరుకావాల్సి ఉందన్నారు.

ఆలోపే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, తదుపరి విచారణ జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు. కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకోవడంలో విఫలమవడంతోనే ఆమె ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల వైఫల్యంపై కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను కూడా పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు విచారణ అధికారి యోగేంద్ర ప్రతాప్‌సింగ్‌ను సస్పెండ్ చేశామని ఎస్పీ తెలిపారు.
యూపీలో శాంతి భద్రతలు పరిరక్షిస్తున్నట్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాజాగా పదే పదే చెబుతున్న తరుణంలో బారాబంకీ రేప్, ఉరి ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విపక్షాలు దీనిపై విమర్శలు మొదలుపెట్టాయి. యోగీ సర్కార్ లో శాంతి భద్రతల పరిస్ధితికి బారాబంకీ ఘటన అద్దం పడుతోందని తెలిపాయి.
-
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
గుడ్ న్యూస్: భారత్ కోసం ఇరాన్ కీలక నిర్ణయం! -
ఓర్నీ.. గ్యాస్ కోసం ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్న జనం.. వైరల్ వీడియో! -
ఇక రోడ్ల మీద విమానంలా దూసుకుపోవచ్చు! గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో అదానీ సత్తా! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications