UP Elections 2022 :వారు అధికారంలోకి వస్తే క్రిమినల్స్ కు అండగా - యూపి ఓటర్లతో ప్రధాని మోదీ..!!
ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం పీక్ కు చేరింది. విమర్శలు తారా స్థాయికి చేరాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ సారి ఎన్నికల్లో పార్టీలు ప్రచార శైలిని మార్చాయి. బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో తొలిసారిగా ప్రధాని మోదీ వర్చ్యువల్ ప్రసంగం చేసారు. జన్ చౌపల్ కార్యక్రమంలో భాగంగా వర్చువల్‌గా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారు. షామ్లీ, ముజఫర్‌నగర్, భాగ్‌పట్, సహరాన్‌పూర్, గౌతమ్‌బుద్ధ్ నగర్‌ల నియోజకవర్గాల ఓటర్లను బీజేపీకి ఓటు వేయాలని కోరారు. ఆ సమయంలో ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేసారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, ప్రతిపక్షాలు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ ఉత్తరప్రదేశ్ లో మార్పు కోసం ప్రయత్నిస్తుందని, ప్రతిపక్షం మాత్రం ప్రతీకారం కోసం చూస్తోందని విమర్శలు గుప్పించారు. గొడవలకు దిగే మనస్తత్వం ఉన్న వ్యక్తులకు ప్రతిపక్ష పార్టీలు టికెట్లు ఇచ్చాయని ఆరోపించారు ప్రధాని. ఉత్తరప్రదేశ్‌లో స్నేహపూర్వక ప్రభుత్వం కావాలని క్రిమినల్స్ భావిస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు.
దేశంలో ప్రతి పేద కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామని, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా, 15 కోట్ల మంది ఉచిత రేషన్ తీసుకుంటున్నట్టు చెప్పారు ప్రధాని. ఐదేళ్ల కిందట ఇదే యూపీలో పేదల కోసం వచ్చే రేషన్‌ను దోచుకునే వాళ్లని విమర్శించారు.

ప్రస్తుతం ప్రతి ఇంటికీ రేషన్ సరుకులు చేరుతున్నాయని, ఐదేళ్లలో తాము తీసుకొచ్చిన మార్పు ఇదేనని వివరించారు ప్రధాని మోదీ. చిన్న రైతులను ఆదుకునే దిశగా అడుగులు వేస్తున్నామని పీఎం మోదీ చెప్పారు. బీజేపీ ఉత్తరప్రదేశ్ లో మార్పు కోసం ప్రయత్నిస్తుందని, ప్రతిపక్షం మాత్రం ప్రతీకారం కోసం చూస్తోందని విమర్శలు గుప్పించారు.
అమిత్ షా, పలువురు కీలక నేతలు యూపీలోనే మకాం వేసారు. ప్రతిపక్షాల వ్యూహాలకు ధీటుగా ప్రతివ్యూహాలను సిద్దం చేసి.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎలాగైనా బీజేపీ అధికారంలో కొనసాగటమే లక్ష్యంగా మోదీ.. అమిత్ షా వ్యూహాలు అమలు చేస్తున్నాు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఫిబ్రవరి 10న తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. దీంతో..తొలి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల పైన బీజేపీ ముఖ్య నేతలు ప్రధానంగా ఫోకస్ చేసారు.












Click it and Unblock the Notifications