క్రాకర్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం: నలుగురు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లోని సొరానా గ్రామంలో లైసెన్స్‌డ్ క్రాకర్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు మరణించారు.
మంటలను ఆర్పివేశామని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సహరాన్‌పూర్ ఎస్‌ఎస్పీ తెలిపారు. మరోవైపు అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకుని చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించాలని, క్షతగాత్రులకు తగు చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగం అధికారులను సీఎం ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాల్పుల కలకలం
దేశ రాజధానిలో శనివారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్ ప్రాంతంలో శనివారం 10 రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి, ఇద్దరు గాయపడ్డారు.
వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం ప్రకారం.. పోలీసులు, ఉన్నతాధికారులు ప్రస్తుతం సంఘటనా స్థలంలో మోహరించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications