కఫీల్‌ ఖాన్‌ కేసులో యోగీ సర్కారుకు సుప్రీంలోనూ షాక్‌- NSA ప్రయోగం కుదరదన్న కోర్టు

యూపీలోని గోరఖ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారుకు మరోసారి చుక్కెదురైంది. గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా యోగీ సర్కారుకు ఫలితం లేకుండా పోయింది. కఫీల్‌ ఖాన్‌పై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ తన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టారంటూ యూపీలోని యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారు ఆయనపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. జనవరి నుంచి జైల్లో ఉన్న ఆయన్ను విడుదల చేయాలని తాజాగా అలాహాబాద్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కఫీల్‌ ఖాన్‌పై పెట్టిన కేసులు అక్రమమని, కేవలం ప్రసంగాలకే జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం సరికాదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

UP Loses Case In Top Court Seeking Tough Charges Against Dr Kafeel Khan

అలహాబాద్ హైకోర్టు తీర్పుపై యోగీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు కూడా అలహాబాద్‌ హైకోర్టు తీర్పులో జోకక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని తెలిపింది. దీంతో యోగీ సర్కారుకు ఎదురుదెబ్బ తప్పలేదు. సుప్రీం తీర్పుపై స్పందించిన కఫీల్‌ ఖాన్‌ తన సోదరుడి పెళ్లి రోజే తనను జైలుకు పంపాలని భావించిన యోగీ సర్కారు మళ్లీ విఫలమైందని తెలిపారు. న్యాయవ్యవస్ధకు తన ధన్యవాదాలు తెలిపారు. మూడున్నరేళ్లుగా తనకు దేశ విదేశాల్లో మద్దతిస్తున్న వారికీ కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+