వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UP polls: 89 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా, 37 మంది మహిళలకు స్థానం

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మూడో జాబితాను బుధవారం విడుదల చేసింది. ఈ జాబితాలోని మొత్తం 89 మంది అభ్యర్థుల్లో 37 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు 40% సీట్లను అందించడానికి పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశం మూడవ జాబితాలో ప్రతిబింబిస్తుంది.

మూడో జాబితాలో నకూర్ నుంచి రణధీర్ సింగ్, సహరాన్‌పూర్ నుంచి సందీప్ రాణా, దేవ్‌బంద్ నుంచి రాహత్ ఖలీల్, అలీగంజ్ నుంచి సుభాష్ చంద్ర వర్మ తదితరులు పోటీలో ఉన్నారు. 37 మంది మహిళా అభ్యర్థులలో, పూనమ్ కాంబోజ్ బెహత్, అక్బరీ బేగం బిజ్నోర్, బాలా దేవి సైనీ నూర్‌పూర్, సరోజ్ దేవి హత్రాస్-ఎస్‌సి నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.

 UP polls 2022: Congress Releases Third List Of 89 Candidates, Including 37 Women.

అంతకుముందు, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల కోసం 16 మంది మహిళలతో కూడిన 41 మంది అభ్యర్థులతో రెండవ జాబితాను విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్‌లో 30 ఏళ్లకు పైగా అధికారంలో లేనందున, మహిళా సాధికారత, సంక్షేమంపై దృష్టి సారించిన కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తోంది.

కాంగ్రెస్ ప్రచారానికి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నాయకత్వం వహిస్తున్నారు, 'లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్' అనే ప్రచార నినాదాన్ని ప్రారంభించారు, ఇది ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో పార్టీకి రణఘోషగా మారింది. ప్రియాంక గాంధీ గత సంవత్సరం డిసెంబర్‌లో మహిళా-కేంద్రీకృత మేనిఫెస్టోను విడుదల చేశారు, ఇందులో ప్రభుత్వ స్థానాల్లో 40% కోటా, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత రవాణా వంటి హామీలు ఉన్నాయి.

పైన పేర్కొన్న అంశాలతో పాటు, ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో విద్య, భద్రత, స్వయం సమృద్ధి, ఆరోగ్యంపై కూడా కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి-మార్చిలో ఏడు దశల్లో జరగనున్నాయి.

1వ దశ: ఫిబ్రవరి 10
2వ దశ: ఫిబ్రవరి 14
3వ దశ: ఫిబ్రవరి 20
4వ దశ: ఫిబ్రవరి 23
5వ దశ: ఫిబ్రవరి 27
6వ దశ: మార్చి 3
7వ దశ: మార్చి 7
మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

English summary
UP polls 2022: Congress Releases Third List Of 89 Candidates, Including 37 Women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X