UP polls: అధికార పార్టీకి ఎద్దుల దెబ్బ, ప్రతిపక్షానికి లాభం, ప్రధాని ఇలాకాలో సేమ్ సీన్,ఆ ఓట్లు !
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికారంలో రావాలని ఎదురు చూస్తున్న బీజేపీకి ఓ జాతీయ టీవీ చానల్ షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ లో ఎద్దులు, ఆవులు, పశువుల పెంచడం పెద్ద సమస్యగా తయారైయ్యింది. గతంలో పశువులను పెంచుతున్న రైతులు మంచి లాభాలు వస్తే వాటిని విక్రయించేవాళ్లు. ఎద్దులు, ఆవులను కొనుగోలు చేసిన తరువాత వాటిని చంపి వాటి మాంసం విక్రయించేవారు. మాంసం అమ్మడానికి కొందరు పశువులను పెంచి పోషించేవాళ్లు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉత్తరప్రదేశ్ లో గోవధను నిషేధించడం, గోవధ చేసిన వారి మీద కేసులు నమోదు చెయ్యడంతో పశువులు కొనేవాళ్లు కరువయ్యారు. ఇలాంటి సమయంలో రైతులకు పశువులను పెంచడం పెద్ద సమస్యగా మారింది
Recommended Video
. ఉత్తరప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోనే రైతులు పశువులను పెంచడానికి ఇబ్బందులు పడుతున్నారని ఇంతకాలం ప్రచారం జరిగింది. అర్దరాత్రి ఎద్దులు, ఆవులు, పశులు పంటల మీద పడి వాటిని తినేసి పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఉత్తరప్రదేశ్ లో ఓ జాతీయ టీవీ చానల్ నిర్వహించిన సర్వేలు తూర్పు, పశ్చిమ ప్రాంతాలే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసితో పాటు మొత్తం ఉత్తరప్రదేశ్ లో ఎద్దుల దెబ్బతో రైతులు తీవ్రనిరాశతో అసహనం వ్యక్తం చేస్తున్నారని వెలుగు చూడటంతో బీజేపీ నాయకులు షాక్ అయ్యారని తెలిసింది.

పశువుల మీద ఆధారపడిన రైతులు
ఉత్తరప్రదేశ్ లో ఎద్దులు, ఆవులు, పశువుల పెంచడం పెద్ద సమస్యగా తయారైయ్యింది. గతంలో పశువులను పెంచుతున్న రైతులు మంచి లాభాలు వస్తే వాటిని విక్రయించేవాళ్లు. ఎద్దులు, ఆవులను కొనుగోలు చేసిన తరువాత వాటిని చంపి వాటి మాంసం విక్రయించేవారు. సొంత పొలాలు లేని చాలా మంది రైతులు పశువులను పెంచి పోషించి వాటిని విక్రయించి జీవనం సాగించేవాళ్లు.

గో మాంసం బ్యాన్ చేసిన యోగి ప్రభుత్వం
ఎద్దులు, ఆవులను కొనుగోలు చేసిన తరువాత వాటిని చంపి వాటి మాంసం విక్రయించేవారు. మాంసం అమ్మడానికి కొందరు పశువులను పెంచి పోషించేవాళ్లు. అయితే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉత్తరప్రదేశ్ లో గోవధను నిషేధించడం, గోవధ చేసిన వారి మీద కేసులు నమోదు చెయ్యడంతో పశువులు కొనేవాళ్లు కరువయ్యారు.

పంటలు నాశనం చేస్తున్న ఎద్దులు, పశువులు
ఇలాంటి సమయంలో రైతులకు పశువులను పెంచడం పెద్ద సమస్యగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లోనే రైతులు పశువులను పెంచడానికి ఇబ్బందులు పడుతున్నారని ఇంతకాలం ప్రచారం జరిగింది. అర్దరాత్రి ఎద్దులు, ఆవులు, పశులు పంటల మీద పడి వాటిని తినేసి పంటలు నాశనం చేస్తున్నామని రైతులు ఆరోపిస్తున్నారు.

అన్నదాతలు అసహనం
అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఉత్తరప్రదేశ్ లో ఓ జాతీయ టీవీ చానల్ నిర్వహించిన సర్వేలు తూర్పు, పశ్చిమ ప్రాంతాలే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసితో పాటు మొత్తం ఉత్తరప్రదేశ్ లో ఎద్దుల దెబ్బతో రైతులు తీవ్రనిరాశతో అసహనం వ్యక్తం చేస్తున్నారని వెలుగు చూడటంతో బీజేపీ నాయకులు షాక్ అయ్యారని తెలిసింది.

పరిష్కారం మాత్రం చూపించలేదు
ఎద్దులు, ఆవులు, పశువులను విక్రయించడం బ్యాన్ చేసిన యోగి ఆదిత్యనాథ్ వాటికి ఆహారం అందించడానికి గోశాలలను ఏర్పాటు చేశారు. గోశాల్లో సరైన ఆహారం లేకపోవడంతో అర్దరాత్రి పూట ఆ పశువులు సమీపంలోని పంటపొలాల్లోకి వెళ్లిపోయి అక్కడి పంటను నాశనం చేసి తినేస్తున్నాయని, ఇక్కడి ప్రభుత్వం ఇంత వరకు ఈ విషయంలో పరిష్కారం మాత్రం చూపించలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

ఎస్పీకి లాభం అంటున్న సర్వే ?
ఎద్దులు, ఆవులు పెంచుతున్నది రైతులు కావడం, పంటలు నాశనం అవుతున్నది రైతులకు చెందిన పంటలు కావడంతో ఇప్పుడు రైతులు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారని తెలిసింది. రైతుల ఓట్లను లబ్ది పొందడానికి ఎస్పీ ప్రయత్నాలు చేస్తోందని, రైతులకు హామీలు ఇచ్చే విషయంలో బీజేపీ వరలు కురిపిస్తోందని, అయితే చివరికి నిమిషం వరకు రైతులు ఎవరికి ఓటు వేస్తారో అనే విషయం ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్, ఇటావా, షాజాహాన్ పూర్, బరేలి, కాన్పూర దేవత్, మెయిన్ పురి తదితర ప్రాంతాల్లో సర్వే చేసిన ఆ జాతీయ టీవీ చానల్ సర్వే వెల్లడించింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications