గ్యాంగ్ రేప్: వీడియో తీసి, అందరికీ పంపారు, సూసైడ్ (వీడియో)
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 40 ఏళ్ల మహిళ పైన సాముహిక అత్యాచారం జరిగింది. దీనిని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆ ఘోరాన్ని వీడియో తీశారు. దానిని ఎమ్మెమ్మెస్ ద్వారా లీక్ చేశారు.
ఈ నేపథ్యంలో ఘటన జరిగిన ముజఫర్ నగర్ ప్రాంతంలో పోలీసులు భద్రతను పెంచారు. సమాచారం మేరకు... బాధిత మహిళ ఉంటున్న ప్రాంతంలో సెక్యూరిటీ పెంచారు. నిందితులు నలుగురు కూడా వేర్వేరు వర్గాలకు చెందిన వారు.
40 ఏళ్ల మహిళ నర్సుగా పని చేస్తోంది. ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా దారుణం జరిగింది. ఈ సంఘటనను నిందితులు తమ సెల్ ఫోన్లో వీడియో తీశారు. దానిని వాట్సాప్ ద్వారా పలువురికి పంపించారు.

ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మిగతా ముగ్గురి కోసం గాలిస్తున్నారు. వారి పరారీలో ఉన్నారు.
బాధితురాలు నర్సుగా పని చేస్తుండటంతో... ప్రధాన నిందితుడు వచ్చి గర్భవతిగా తన భార్యను పరీక్షించాలని ఆమెకు చెప్పాడు. పరీక్షించి తిరిగి ఇంటికి వస్తుండగా.. అతను, మిగతా ముగ్గురు కలిపి ఆమె పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ ఘోరం మొత్తాన్ని నిందితులు వీడియో తీశారు. ఇదే విషయాన్ని ఆమె భర్తకు చెప్పారు. దీంతో ఆ బాధితురాలు షాక్‌కు గురయ్యారు.
ఘటన విషయమై బాధితురాలి భర్త మాట్లాడుతూ... షాహిబ్, ఇతర ముగ్గురు స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారని, దానిని వీడియో తీశారని చెప్పాడు. ఈ విషయాన్ని తన భార్య తనకు ఇంటికి వచ్చాక చెప్పిందన్నాడు.
అంతేకాదు, తన భార్యకు ఫోన్ చేసిన నిందితుడు.. ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తానని బెదిరించాడని చెప్పాడు. అన్నట్లుగానే సాయంత్రం ఆ వీడియోను కొందరికి పంపించాడని, దీంతో తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు.
కాగా, పోలీసులు మాట్లాడుతూ... కేసు నమోదు చేసుకున్నామని, దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు. మిగతా ముగ్గురు నిందితులను పట్టుకునేందుకు టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నామన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications