Yogi Adityanath: ఈ ఎన్నికలు దేవుళ్లకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధం..!

లక్నో: త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికలు దేవాసుర యుద్ధంగా అభివర్ణించారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. అవినీతి పరులకు, క్రిమినల్స్‌కు గట్టి గుణపాఠం నేర్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. నైమిషరణ్యలోని సీతాపూర్‌ ఎన్నికల ప్రచారంలో సీఎం యోగీ పాల్గొని ప్రసంగించారు.

సీతాపూర్‌ ర్యాలీలో ప్రసంగించిన యోగీ ఆదిత్యనాథ్... ఈ పట్టణం దధీచీతో ముడిపడి ఉందని గుర్తుచేశారు. పురాణాల ప్రకారం దదీచీ అనే రుషి తన ప్రాణాలను త్యాగం చేసినట్లుగా ఉంది. తన మరణిస్తే తన ఎముకలతో వజ్రాయుధం తయారు అవుతుందని భావించి ప్రాణత్యాగం చేశాడు దదీచీ.ఆ వజ్రాయుధంతో రాక్షసులను సంహరించేందుకు పనికొస్తుందని భావిస్తాడు.

 yogi

ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ కథను వివరించిన యోగీ ఆదిత్యనాథ్.. నైమిశరణ్య ప్రాంతాన్ని కూడా ఒక పవిత్రమైన పట్టణంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న కాశీ, అయోధ్య, మథురాలో ఎలా అయితే అభివృద్ధి చేశామో అలానే అభివృద్ధి చేస్తామని యోగీ చెప్పారు. కాశీ వెలిగిపోతోంది, అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతోంది, మథురాలో కూడా ఆధ్యాత్మికత సంతరించుకుంటోంది ఇప్పుడు నైమిశరణ్య వంతు అని చెప్పారు.

నైమిశరణ్యలో త్వరలోనే విద్యుత్‌తో నడిచే బస్సులను ప్రవేశపెడుతామని చెప్పారు. కొన్ని నెలల తర్వాత ఇక్కడి నుంచి హెలికాఫ్టర్ సేవలు కూడా ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. రహదారుల విస్తరణ చేపడతామని ప్రకటించారు. నైమిశరణ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఒక పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందని తద్వారా ఉపాధి లభిస్తుందని చెప్పారు.

సీతాపూర్‌లో తయారయ్యే కార్పెట్‌లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, ఈ ఎగుమతిని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్ స్కీమ్ కింద చేస్తున్నట్లు చెప్పారు. డబల్ ఇంజిన్ సర్కార్‌కు ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో ట్రిపుల్ ఇంజిన్‌లా మారుతుందని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.గత తొమ్మిదేళ్లలో దేశ ముఖచిత్రం క్రమంగా మారుతూ వస్తోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+