వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో స్నేహితురాలి అసభ్య ఫోటో, మహిళ వేధింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తన స్నేహితురాలి అసభ్యకర ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి జైలుకు వెళ్లాడు. అభిషేక్ మిశ్రా అనే ఇరవై ఏళ్ల యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. అభిషేక్‌ను అరెస్టు చేసి ఫోటోలను తొలగించినట్లు ఎస్పీ గోస్వామి ఆదివారం చెప్పారు. అభిషేక్ ఫేస్‌బుక్ అకౌంటును కూడా రద్దు చేశారు. అతనిని రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

బాలుడికి లైంగిక వేధింపులు

శారీరక సంబంధం కోసం 14 ఏళ్ల బాలుడిపై ఒత్తిడి తెచ్చినందుకు ఓ మహిళ (31)పై పంజాబ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు 8వ తరగతి విద్యార్థి. ట్యూషన్‌ కోసం వచ్చిన తన వద్దకు వచ్చిన ఆ బాలుడిని లైంగిక కార్యకలాపాల కోసం ఆమె ఒత్తిడి చేసేదని పోలీసులు తెలిపారు. ఓ వీడియో తీసి, బెదిరించిందని పేర్కొన్నారు.

UP youth posts obscene photo of girlfriend on Facebook, arrested

చెన్నైలో 100 కోట్ల హెరాయిన్‌ స్వాధీనం

ఢిల్లీ పోలీసులు చేపట్టిన నిఘాలో చెన్నై పూందమల్లిలో మాదకద్రవ్యాల విక్రయ ముఠా పట్టుబడింది. ఇంట్లో దాచి ఉంచిన రూ.100 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శ్రీలంకకు చెందిన ఇద్దరితో పాటు మరొక వ్యక్తిని అరెస్టు చేశారు.

చెన్నై కేంద్రంగా దేశంలోని ప్రధాన నగరాలకు హెరాయిన్‌ చేరుతున్నట్టు ఢిల్లీ మాదకద్రవ్య నియంత్రణ విభాగం పోలీసులకు సమాచారం ఉండడంతో ఆరు నెలలుగా నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో పూందమల్లి మల్లీశ్వర నరసింహనగర్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసముంటున్న తిరునల్వేలి జిల్లాకు చెందిన పెరుమాళ్‌(24) అనే వ్యక్తిపై అనుమానాలు రావడంతో నగర పోలీసుల సహాయం తీసుకొన్నారు.

శుక్రవారం రాత్రి పెరుమాళ్‌ను అదుపులోకి తీసుకుని అతని నుంచి రెండు సూట్‌కేసులను స్వాధీనం చేసుకోగా, 18 కిలోల హెరాయిన్‌ అందులో ఉన్నట్లు గుర్తించారు. పెరుమాళ్‌ ఇచ్చిన సమాచారం మేరకు హెరాయిన్‌ అక్రమ తరలింపునకు పాల్పడిన శ్రీలంక వాసులు టోబిక్‌(40), రాబిక్‌(61)లనూ అదుపులోకి తీసుకొన్నారు.

English summary
A 20-year-old youth allegedly posted an obscene photograph of his girlfriend on Facebook, following which he was today arrested, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X