మనకు వారి తలలు కావాలి : ఉరి డైరెక్టర్ సంచలన పోస్ట్

జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 అమాయకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా అభివర్ణించాయి. అటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే పాకిస్థాన్ కు చెక్ పెట్టేందుకు 5 సంచలన నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకుంది. పాకిస్థాన్ పై దెబ్బకు దెబ్బ తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఈ క్రమంలో ఉగ్రమూకలు జరిపిన మారణ హోమంపై "ఉరి - సర్జికల్ స్ట్రైక్" సినిమా రచయిత, దర్శకుడు ఆదిత్య ధర్ స్పందించారు. తన అధికారిక ఎక్స్, ఇన్ స్టా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. ఆదిత్య ధర్ తన స్టోరీలో... "వారికి కాశ్మీర్ కావాలి. మనకు వారి తలలు కావాలి" అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు ఆదిత్య ధర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Uri Director Aditya Dhar Breaks Silence on Pahalgam Terror Attack

కశ్మీర్‌ ఉరి సెక్టార్ల‌లో ఇండియన్ ఆర్మీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటన ఆధారంగా రూపొందిన చిత్రం 'ఉరి-ది సర్జికల్ స్ట్రైక్'. ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా విక్కీ కౌశల్, పరేష్ రావల్, యామీ గౌతమ్, కీర్తి కుల్‌హరి, మోహిత్ రైనా ముఖ్య పాత్రలు పోషించారు. 2019 జనవరి 19న ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ 2016లో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉరిలో భారత సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ పై ఆధారపడి తీశారు. రూ. 44 కోట్లతో తీసిన ఈ మూవీకి ఏకంగా రూ. 350 కోట్లు రాబట్టింది. ఆ ఏడాదిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఉగ్రదాడిపై ఇవాళ సాయంత్రం దిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. పహల్గాం దాడి తర్వాత కేంద్రం తీసుకున్న చర్యలను వివరించనున్నారు.పాకిస్థాన్‌పై దౌత్యపరమైన, ఆర్థికపరమైన చర్యలతో పాటు, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుందన్న అంశంపై చర్చించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+