ప్రధాని మోదీతో తులసీ గబ్బార్డ్ భేటీ
అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ వంటి ముప్పును ఎదుర్కోవడంలో సహకారం పెంపొందించే మార్గాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశం సందర్భంగా గబ్బార్డ్‌కు మోదీ మహా కుంభమేళా సందర్భంగా తీసుకొచ్చిన గంగా జలాన్ని అందజేశారు. అనంతరం మోదీకి ఆమె రుద్రాక్ష మాల బహూకరించారు. గడిచిన రెండు నెలల్లో ప్రధాని మోదీతో గబ్బార్డ్ రెండోసారి భేటీ కావడం గమనార్హం.

ఈ సమావేశానికి ముందు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో గబ్బార్డ్ సమావేశమయ్యారు. నిఘా సమాచారాన్ని పంచుకోవడంతోపాటు భారత్- అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు.
#WATCH | Delhi: US Director of National Intelligence (DNI) Tulsi Gabbard met Prime Minister Narendra Modi today. The PM presented her with a vase containing Gangajal from the recently concluded Prayagraj Mahakumbh. pic.twitter.com/jJ0OJbggNF
— ANI (@ANI) March 17, 2025
ఖలిస్థానీ ఉగ్ర సంస్థ సిక్కు ఫర్ జస్టిస్‌తో పాటు దాని వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపైనా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ కోరారు. అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్‌తో తులసీ గబ్బార్డ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీపై చర్చించారు. భారత్- అమెరికాల మధ్య దృఢమైన సంబంధం కోసం కట్టుబడి ఉండాలని తీర్మానించారు.












Click it and Unblock the Notifications