తేడా వస్తే దబిడి దిబిడే..! భారతీయ విద్యార్ధిపై దాడిని సమర్ధించుకున్న అమెరికా ..!

అమెరికాలోని నెవార్క్ ఎయిర్ పోర్టులో తాజాగా ఓ భారతీయ విద్యార్ధిపై అక్కడి భద్రతా సిబ్బంది అమానుషంగా ప్రవరించారు. న్యూజెర్సీలోని న్యూవార్క్ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థిని చేతులకు సంకెళ్లు వేసి పట్టుకున్న షాకింగ్ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై విమర్శలు రావడంతో కొద్ది గంటల్లోనే భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం స్పందించింది. ఈ మేరకు ఎక్స్ లో దీనిపై క్లారిటీ ఇచ్చింది.

తమ దేశం చట్టబద్ధమైన ప్రయాణికులను స్వాగతిస్తూనే ఉన్నప్పటికీ, అక్రమ ప్రవేశం, వీసాల దుర్వినియోగం లేదా అమెరికా చట్టాల ఉల్లంఘనను సహించదని భారత్ లో రాయబార కార్యాలయం తేల్చిచెప్పింది. నెవార్క్ లో జరిగిన ఘటనపై భారత్ లో వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ స్పష్టత ఇచ్చింది. తమ దేశంలోకి చట్టబద్ధంగా ప్రవేశించే వారికి మాత్రం తాము ఎప్పటికీ స్వాగతం పలుకుతామని తేల్చిచెప్పింది.

US embassy in india justified handcuffing held down of Indian student at Newark airport

అమెరికాలోని నెవార్క్ ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను మన దేశానికే చెందిన కునాల్ జైన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. భారతీయ విద్యార్థితో అక్కడి పోలీసుల వ్యవహారశైలి తీవ్ర అమానవీయం, మానవ విషాదంగా అతను అభివర్ణించాడు. ఇటీవల ఇలాంటి కేసులు జరుగుతున్నాయని కూడా తెలిపారు. దీంతో ఈ వ్యవహారం భారత్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దీంతో న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. నెవార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక భారతీయుడు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌లను చూసినట్లు వెల్లడించింది. ఈ విషయంలో తాము స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది. భారత్ లోనూ విపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ వీడియోపై తీవ్రంగా స్పందించింది. అమెరికాలో భారతీయులపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోడీ స్పందించి ట్రంప్ తో మాట్లాడాలని డిమాండ్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+