వీసా గడువు దాటినా అమెరికాలో ఉంటున్నారా ? యూఎస్ ఎంబసీ ఫైనల్ వార్నింగ్..!
అమెరికాలో ట్రంప్ సర్కార్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇందులో భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. అమెరికాలో వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో అధికారులకు దొరికితే ఏం చేస్తారో అన్న భయంతో చాలా మంది భారతీయులు తమ వీసా గడువు ముగిసినా స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లోని యూఎస్ ఎంబసీ వారికి కీలక హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికాలో వీసా గడువు ముగిసినా స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోతున్న భారతీయులకు న్యూఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయం ఇవాళ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వీసా గడువు ముగిసినా భారత్ కు రాకుండా అమెరికాలో ఉండిపోతున్న వారు తనిఖీల్లో దొరికితే బహిష్కరణలు తప్పవని, అలాగే వారిపై అమెరికాకు రాకుండా శాశ్వత నిషేధం విధించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది.

కఠినమైన అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల అమలు ఎలా ఉంటుందో వీసాదారుకు ఎంబసీ మరోసారి గుర్తుచేసింది. ఎక్స్ లో చేసిిన పోస్టులో మీరు మీకు ఇచ్చిన కాలానికి మించి అమెరికాలో ఉంటే మిమ్మల్ని బహిష్కరించవచ్చు , భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణించడంపై శాశ్వత నిషేధాన్ని ఎదుర్కోవచ్చని తెలిపింది. ప్రస్తుతం అమెరికాలో పర్యాటక, విద్యార్ధి, ఉద్యోగాల సహా అన్ని వీసాదారులకూ ఇది వర్తిస్తుందని పేర్కొంది.
If you remain in the United States beyond your authorized period of stay, you could be deported and could face a permanent ban on traveling to the United States in the future. pic.twitter.com/VQSD8HmOEp
— U.S. Embassy India (@USAndIndia) May 17, 2025
దీంతో అమెరికాలో ఉండే భారతీయులు వీసా గడువు ఉంటే సరి, లేకపోతే వెంటనే వెనక్కి వచ్చేయాలనేది ఎంబసీ హెచ్చరికగా తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాలో పలసదారుల బహిష్కరణల పర్వం కొనసాగుతుండటం, అందులోనూ భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎంబసీ చేసిన తాజా హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎంబసీ హెచ్చరిక తర్వాత అయినా అక్కడ ఉండే అవకాశం లేని వారు వెంటనే వెనక్కి వచ్చేస్తే మేలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications