వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఎస్ఎస్‌ను తీవ్రవాద గ్రూప్‌గా ప్రకటించాలని అడిగే హక్కు లేదు: కోర్టుకు అమెరికా

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్/న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం‌సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను విదేశీ తీవ్రవాద సంస్థగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా అమెరికా ప్రభుత్వం సంబందిత కోర్టును కోరింది. ఈ పిటిషన్ దాఖలు చేసిన సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జె)కు అలాంటి డిమాండ్ చేసే హక్కు లేనేలేదని స్పష్టం చేసింది.

ఈ మేరకు విదేశాంగమంత్రి జాన్‌కెర్రీ తరపున న్యాయవాది ప్రీత్ భరారా పిటిషన్ దాఖలు చేస్తూ ఎస్ఎఫ్‌జె ఫిర్యాదును కొట్టివేయాల్సింది మాన్‌హాటన్ కోర్టును అభ్యర్థించారు.

US seeks dismissal of lawsuit by Sikh group to declare RSS terror group

సంబంధిత అమెరికా చట్టం కింద ఆర్ఎస్ఎస్‌ను విదేశీ తీవ్రవాద సంస్థగా ప్రకటించాలంటూ ఎస్ఎఫ్‌జె కోరిందని, అయితే ఎస్ఎఫ్‌జెకు గానీ, ఈ న్యాయస్థానానికి గానీ అమెరికా విదేశాంగ మంత్రిపై ఈ మేరకు ప్రకటించేలా ఒత్తిడితెచ్చే అధికారమేదీ లేదని భరారా తెలిపారు.

కాగా, బాబ్రీ మసీదు కూల్చివేత, గోల్డెన్ టెంపుల్‌లో ఆర్మీ ఆపరేషన్, 2008లో చర్చిపై దాడి, 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ఆర్ఎస్‌ఎస్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఎస్ఎఫ్‌జె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

English summary
A Sikh rights group had filed a lawsuit to designate RSS as a "foreign terrorist organisation". The federal court in the Southern District of New York issued a summons for US Secretary of State John Kerry to respond to the suit within 60 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X