యూఎస్ విద్యార్థుల వీసాల ప్రక్రియ మళ్ళీ మొదలు.. సోషల్ వెట్టింగ్ బడా ట్విస్ట్!
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే వారికి యూఎస్ కీలక అప్డేట్ ని ఇచ్చింది. గత కొంతకాలంగా విద్యార్థులకు సంబంధించి తాత్కాలికంగా వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్ ప్రక్రియను నిలిపివేసిన ట్రంప్ ప్రభుత్వం వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్ ను తిరిగి మళ్లీ ప్రారంభించింది అయితే ఈ షెడ్యూలింగ్ తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూనే సోషల్ వెడ్డింగ్ విషయంలో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది.
అమెరికా వీసాల ప్రక్రియ మళ్ళీ మొదలు
అమెరికా విద్యార్థి వీసాల జారీ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. అయితే కొత్త షరతుగా సోషల్ మీడియా వెట్టింగ్ తప్పనిసరి చేసింది అమెరికా. దీని కింద వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను అధికారులు తనిఖీ చేసుకోవడానికి వారి ప్రొఫైల్ ను పబ్లిక్ గా సెట్ చేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను ప్రైవేట్ గా పెట్టుకోవడానికి వీల్లేదు.

ప్రతీ విద్యార్ధి సోషల్ మీడియా ఖాతాల తనిఖీ
ఈ నిబంధనను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించింది. ఈసారి వీసా దరఖాస్తులతో పాటు దరఖాస్తుదారులను సోషల్ మీడియా కార్యకలాపాలను తప్పనిసరిగా పరిశీలిస్తామని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఈ కొత్త నిబంధన పైన మాట్లాడిన విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఈ సోషల్ వెట్టింగ్ ద్వారా ప్రతి వ్యక్తిని సమగ్రంగా పరిశీలించడానికి వీలు కలుగుతుందని తెలిపారు.
నూతన మార్గదర్శకాల జారీ
వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను, వారి సోషల్ మీడియా కార్యకలాపాలను తప్పనిసరిగా పరిశీలించనున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ అధికారి పేర్కొన్నారు. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేశారు. వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఎవరైనా సరే సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్ ను చేంజ్ చెయ్యాల్సి ఉంటుంది.
సోషల్ వెట్టింగ్ తప్పనిసరి చేసి ట్విస్ట్
ఈ సంవత్సరం మే నెలాఖరు నుండి స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ నిలిపివేసిన అమెరికా మళ్ళీ ఎప్పుడు వీసా ఇంటర్వ్యూలకు అవకాశం కల్పిస్తుంది అని అంతా ఎదురుచూశారు. ఈ క్రమంలో తాజాగా మళ్ళీ వీసాల ప్రక్రియ షురూ చేసిన యూఎస్ మాత్రం సోషల్ వెట్టింగ్ తప్పనిసరి చేసి ట్విస్ట్ ఇచ్చింది. ముఖ్యంగా దేశ భద్రత విషయంలో సోషల్ మీడియా పోస్టులపై యూఎస్ ప్రధానంగా ఫోకస్ చేయనుంది.












Click it and Unblock the Notifications