యూఎస్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ షాకింగ్ వార్త మీ కోసమే!
నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ అమెరికా (యూఎస్) ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వెళ్లాలని భావిస్తున్న ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చేలా టూరిస్ట్ వీసా ఫీజులను యూఎస్ భారీగా పెంచింది అన్న వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఈ నిర్ణయంతో ముఖ్యంగా భారతీయులు, విద్యార్థులు, పర్యాటకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా పెరిగిన యూఎస్ టూరిస్ట్ వీసా ఫీజు
అమెరికా ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం, టూరిస్ట్ వీసా (B1/B2)తో పాటు ఇతర నాన్-ఇమిగ్రెంట్ వీసా కేటగిరీలకు సంబంధించిన ఫీజుల్లో పెరుగుదల నేటినుండి చోటు చేసుకుంటుంది. ఇప్పటివరకు టూరిస్ట్ వీసాపై యూఎస్ వెళ్ళాలి అనుకునే వారి 185డాలర్లు వీసా ఫీజు చెల్లించాల్సి ఉండేది. దానిని అమాంతం పెంచేసి 185డాలర్లతో పాటు మరో 250డాలర్లు అదనంగా చెల్లించాలని యూఎస్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో టూరిస్ట్ వీసా ఫీజు బాగా పెరిగింది.

డబుల్ కంటే ఎక్కువగా పెరిగిన వీసా ఫీజు .. అయితే ఒక ఉపశమనం కూడా
నూతన సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ మార్పులు అమల్లోకి తీసుకువచ్చినట్లు చెప్తున్నారు. దీని ప్రకారం ఇప్పటివరకు 17 వేల రూపాయలు వీసా ఫీజుగా చెల్లిస్తే, ఇకపై 40వేల రూపాయలు వీసా ఫీజుగా చెల్లించాలి. కానీ ఇందులో కొంత ఉపశమనం ఇచ్చే వార్త కూడా యూఎస్ ప్రభుత్వం చెప్పింది, ఎవరైతే యూఎస్ వెళ్లి తిరిగి చెప్పిన సమయంలోనే తిరిగి వస్తారో వారికి వీసా ఇంటిగ్రిటీ ఫీజుగా వసూలు చేసే 250 డాలర్లు తిరిగి ఇస్తారని చెప్తున్నారు.
వీసా ఫీజుల పెంపుతో యూఎస్ ప్రయాణం భారం
అయితే యూఎస్ తాజా నిర్ణయం అయిన వీసా ఫీజుల పెంపుతో విదేశీ ప్రయాణ ఖర్చులు మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికే విమాన టికెట్లు, హోటల్ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. ముఖ్యంగా అమెరికాకు టూరిజం, బిజినెస్, కుటుంబ సభ్యుల సందర్శన కోసం వెళ్లే వారికి ఈ నిర్ణయం ఇబ్బందికరంగా మారింది.
వీసా దరఖాస్తుల సంఖ్య తగ్గే ఛాన్స్
ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భారతీయులు అమెరికాకు పర్యాటక, వ్యాపార అవసరాల కోసం వెళ్తుంటారు. కానీ తాజా ఫీజుల పెంపు కారణంగా వీసా దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదే సమయంలో యూఎస్ వెళ్లి సమయానికి తిరిగి రాకుండా అక్కడే ఉండేవారి సంఖ్య తగ్గుముఖం పడుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications