US Visa: వీసా ఇస్తాం కానీ చుక్కలు చూపిస్తాం..! అమెరికా ఎంబసీ తాజా హెచ్చరిక..!

అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ వీసాదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్.. ఏ చిన్న అవకాశం దొరికినా వీసాలు రద్దు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే అమెరికా వీసా తీసుకోవాలంటే సవాలక్ష నిబంధనలు విధించిన ట్రంప్.. వీటిలో ఏ ఒక్కటి ఉల్లంఘించినా కొత్త వీసా రావడం మాట దేవుడెరుగు, ఉన్న వీసాలు కూడా కోల్పోవడం ఖాయమని తేల్చిచెప్పేస్తున్నారు. తాజాగా భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది.

భారతీయ వీసాదారులు, కొత్త వీసా దరఖాస్తుదారులకు అమెరికా రాయబార కార్యాలయం కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
ఎక్స్ లో పెట్టిన పోస్టులో అమెరికా వీసా మంజూరు చేసిన తర్వాత కూడా తమ అధికారులు వీసా దారుల్ని పర్యవేక్షిస్తూనే ఉన్నారని స్పష్టం చేసింది. ఓసారి వీసా జారీ అయినా తనిఖీలు మాత్రం ఆగబోవని తేల్చిచెప్పేసింది. అమెరికా వీసా తీసుకున్న వారు తమ చట్టాలు, వలస నిబంధనలు పాటిస్తున్నారో తెలుసుకోవడానికి తనిఖీలు చేస్తూనే ఉంటామని తెలిపింది.

US visas not permanently safe embassy s fresh warning to Indians

వీసా నిబంధనలు ఎక్కడైనా ఉల్లంఘించినట్లు తేలితే వారి వీసాలు రద్దు చేయడంతో పాటు దేశ బహిష్కరణ చేసేస్తామని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. భారత్ నుంచి వచ్చే విద్యార్ధులు, కార్మికులు, ఇతర వర్గాలపై ఈ ప్రభావం కచ్చితంగా ఉండబోతోంది. ఓసారి తమ వీసా ఆమోదం అమెరికాలోకి శాశ్వత ప్రవేశం లేదా నివసించడానికి గ్యారంటీ కాదని రాయబార కార్యాలయం తెలిపింది.

వీసా మోసాలకు పాల్పడటం, గడువు ముగిసినా అమెరికా వదలకుండా అక్కడే ఉండిపోవడం, విద్యార్ధి, పని వీసాల దుర్వినియోగం నేపథ్యంలో తనిఖీలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా రాయబార కార్యాలయం ఈ స్పష్టత ఇచ్చేసింది. ఇప్పటికే సోషల్ మీడియా ప్రొఫైల్స్ తనిఖీలతో పాటు ఇతర తనిఖీలు చేసిన తర్వాతే అన్నీ కరెక్ట్ గా ఉన్నాయని తేలితేనే వీసాలు జారీ చేస్తున్నారు. అలా వీసా జారీ అయ్యాక కూడా దానికి గ్యారంటీ లేదని అమెరికా చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+