Uttar Pradesh Assembly Elections 2022 : వచ్చేవారం తేదీలు ప్రకటించనున్న ఈసీ ?
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల సెమీఫైనల్స్ గా భావిస్తున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటం, ధర్డ్ వేవ్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల తేదీల్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. దీంతో వచ్చే వారం ఈ ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ లోని 403 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 10 నుంచి 14 లోపు ఏ క్షణమైనా ఎన్నికల సంఘం తేదీల్ని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. మార్చిలో ఎన్నికల నిర్వహణ చేపట్టే అవకాశముంది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల నేపథ్యంలో యూపీతో పాటు జరగాల్సిన ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనా ఈ ప్రభావం పడబోతోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను ముగించేందుకే ఈసీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్న యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ను వేగంగా పూర్తి చేయాలని కోరుతున్న ఈసీ.. ఎన్నికలు జరిగే లోపు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తికి లక్ష్యం నిర్దేశించుకుంది. అలాగైతేనే ఎన్నికల నిర్వహణ ద్వారా కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. అయితే ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా నత్తనడకన కొనసాగుతుండటం అందరికీ కలవరపెడుతోంది. ఇప్పటికే యూపీ సహా ఈ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికలను వాయిదా వేయొద్దని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూనే ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించాయి. దీంతో ఎన్నికల సంఘం కూడా సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.












Click it and Unblock the Notifications