యూపీ క్రీడాకారులకు 500 ప్రభుత్వ ఉద్యోగాలు- సీఎం యోగీ ఆదిత్యనాథ్ కీలక ప్రకటన..
ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈనెలతో రెండేళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలో భారీ ఎత్తున వేడుకలు కూడా నిర్వహిస్తున్న సీఎం యోగీ.. దీనికి గుర్తుగా పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఇందులో క్రీడారంగానికి పలు శుభవార్తలు చెబుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ పంచాయతీలోనూ క్రీడామైదానాలు, జిల్లాల్లో స్టేడియాలు, బ్లాకుల్లో మినీ స్టేడియాలు ఏర్పాటు చేయాలని నిర్ణయంచిన యోగీ ఆదిత్యనాథ్.. ఇప్పుడు క్రీడాకారులకు కూడా వరాలు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతిభావంతులైన 500 మందికి పైగా క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం యోగీ ఆదిత్యనాథ్ నిర్ణయించారు. వీరిని పోలీసు శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న 71వ ఆల్ ఇండియా పోలీస్ అథ్లెటిక్స్ క్లస్టర్ ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు.

పదేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. నేపాల్, భూటాన్‌లతో భారతదేశ సరిహద్దులలో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్న సశాస్త్ర సీమా బల్ కూడా ఈ కార్యక్రమ నిర్వాహకుల్లో ఉన్నందుకు సంతోషంగా ఉందని ఆదిత్యనాథ్ తెలిపారు. 32 జిల్లాల నుంచి 1,300 మంది క్రీడాకారులు పాల్గొనడం ఈ ఏడాది ఛాంపియన్‌షిప్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత తొమ్మిదేళ్లలో దేశంలో క్రీడా సంస్కృతి అభివృద్ధి చెందిందని,
ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్ క్రీడల్లో క్రీడాకారుల భాగస్వామ్యం పెరగడమే కాకుండా ఈ పోటీల్లో పతకాలు సాధిస్తున్నట్లు తెలిపారు. సంసద్ ఖేల్ మహోత్సవంతో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో సుమారు 2,000 నుండి 2,500 మంది క్రీడాకారులు క్రీడా కార్యక్రమాలతో లింక్ అయి ఉన్నట్లు యోగీ వెల్లడించారు.












Click it and Unblock the Notifications