నిన్ను డ్రమ్ములో ప్యాక్ చేస్తా: భార్య బెదిరింపులకు భర్త షాకింగ్ నిర్ణయం

ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లో ఓ భర్త తన భార్య మొబైల్ ఫోన్‌లో చూసిన మెసేజ్ అతడి వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏకంగా తన భార్యను ఆమె ప్రియుడితో వెళ్లిపోవడానికి అంగీకరించిన ఓ వింత, భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. యూపీకి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తికి తన భార్య ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం ఉంది. ఆమె తరచూ తనతో గొడవ పడుతూ ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయేదని అతడు ఆరోపిస్తున్నాడు. గతేడాది జులైలో తన 6 నెలల పసిబిడ్డను వదిలేసి మరీ ఆమె వెళ్లిపోయిందని.

ఆ మూడు ముక్కలే కొంపముంచాయి!
రాజ్‌కుమార్ తన భార్య ఫోన్‌ను లాక్కొని చెక్ చేయగా.. అందులో అతనికి దిమ్మతిరిగే విషయాలు కనిపించాయి. ఫేస్‌బుక్‌లో కొన్ని హత్యా ఉదంతాలకు సంబంధించిన పోస్టులు ఉండటమే కాకుండా.. "నీలిరంగు డ్రమ్, సిమెంట్" అనే క్యాప్షన్లతో తన ఫోటోలు ఉండటాన్ని గమనించాడు. నిజానికి ఇది గతేడాది మీరట్‌లో జరిగిన ఓ దారుణ హత్యను గుర్తు చేస్తోంది. 2025 మార్చిలో ముస్కాన్ అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను చంపి.. బాడీని ముక్కలుగా కోసి సిమెంట్ నింపిన నీలిరంగు డ్రమ్‌లో దాచిపెట్టింది. రాజ్‌కుమార్ భార్య కూడా సరిగ్గా అదే ప్లాన్ చేస్తోందని అతడికి అర్థమైంది. గొడవ జరిగిన ప్రతిసారీ "నిన్ను కూడా డ్రమ్ములో ప్యాక్ చేస్తాను" అని ఆమె బెదిరించేదని రాజ్‌కుమార్ వాపోయాడు.

Uttar Pradesh Man Finds Cement and Drum Post on Wife Phone Lets Her Go With Lover to Save His Life

ప్రియుడికే ఇచ్చేశాడు..
"ఆమెకు నేనంటే ఇష్టం లేదు. కనీసం వంట చేయదు, బట్టలు ఉతకదు. పసిబిడ్డను కూడా సరిగ్గా చూసుకోదు. ఫోన్ లాక్కున్నందుకు నన్నూ, నా ముగ్గురు సోదరులను చంపేస్తానని బెదిరించింది" అని రాజ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల సమక్షంలో జరిగిన కౌన్సెలింగ్‌లో కూడా ఆమె తన ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన రాజ్‌కుమార్, ఆమె ప్రియుడిని పిలిపించి మరీ ఆమెను పంపించివేశాడు. తన ప్రాణాలు పోతే తన బిడ్డ అనాథ అవుతుందని భావించి.. ఆమె ప్రియుడిని పిలిపించి మరీ తన భార్యను అతనితో పంపించేసి గండం గడిచిందని ఊపిరి పీల్చుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+